News July 12, 2024

అనంత్ అంబానీ పెళ్లికి రూ.5వేల కోట్లు ఖర్చు?

image

ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈరోజు జరగనున్న అనంత్ అంబానీ పెళ్లి గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొన్ని నెలలుగా సాగుతున్న వేడుకల్లో ప్రపంచంలోని టాప్ సెలబ్రెటీలు పాల్గొన్నారు. కాగా, అనంత్-రాధికను ఆశీర్వదించేందుకు సెలబ్రెటీలు, పొలిటీషియన్స్ ముంబై చేరుకున్నారు. వివాహానికి మొత్తం రూ.5000 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఫోర్బ్స్ అంచనా వేసింది. ఇది అంబానీ నికర విలువలో 0.5% మాత్రమే.

Similar News

News April 24, 2025

వారికి ఆ అవకాశం ఇవ్వొద్దు: పాలస్తీనా అధ్యక్షుడు

image

పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ హమాస్‌పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆయుధాలను, ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టాలని హుకుం జారీ చేశారు. ‘హమాస్ కుక్కల్లారా.. బందీలను వెంటనే విడిచిపెట్టండి. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న నరమేధం ఆగాలి. బందీల కోసమంటూ ఆ దేశం నరకం సృష్టిస్తోంది. వారికి ఆ అవకాశం ఇవ్వొద్దు’ అని సూచించారు. కాగా హమాస్‌పై పాలస్తీనా నుంచి ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం కావడం ఇదే తొలిసారి.

News April 24, 2025

ఉగ్రదాడి.. 11 మందిని కాపాడిన కశ్మీరీ వ్యాపారి

image

J&K ఉగ్రదాడి నుంచి 4 కుటుంబాలకు చెందిన 11 మందిని కశ్మీరీ దుస్తుల వ్యాపారి నజకత్ అలీ కాపాడారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వీరు ఇటీవల పహల్‌గామ్ వెళ్లారు. పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ ఉండగా కాల్పులు జరిగాయి. అక్కడే ఉన్న నజకత్ సమయస్ఫూర్తి ప్రదర్శించి వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆయన వల్లే తాము ప్రాణాలతో బయటపడ్డామని శివాంశ్ జైన్, అరవింద్ అగర్వాల్, హ్యాపీ వధావన్, కుల్దీప్ స్థాపక్ వెల్లడించారు.

News April 24, 2025

IPL: నేడు RCBvsRR.. గెలిచేదెవరో?

image

ఇవాళ RCB, RR మధ్య బెంగళూరు వేదికగా రా.7.30 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 30 మ్యాచులు ఆడగా RCB 16, రాజస్థాన్ 14 గెలిచాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో బెంగళూరు (10pts) నాలుగు, RR ఎనిమిదో (4pts) స్థానంలో ఉన్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు RCB తన సొంత గ్రౌండ్‌లో గెలవలేదు. అటు RR గెలవాల్సిన మ్యాచుల్లో చేజేతులా ఓడుతోంది. ఆ జట్టు కెప్టెన్ శాంసన్ నేటి మ్యాచుకూ దూరం కానున్నట్లు సమాచారం.

error: Content is protected !!