News March 16, 2024

అనంత: పదో తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం

image

ఈనెల 18 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు, పరీక్ష అనంతరం తిరిగి ఇంటికి చేరేందుకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు శనివారం అనంతపురం రీజనల్ మేనేజర్ సుమంత్ ఆర్.ఆదోని తెలిపారు. విద్యార్థులు పరీక్ష రోజుల్లో హల్ టికెట్ చూపించి అన్ని పల్లెవెలుగు, అల్ట్రా సర్వీసు బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు.

Similar News

News March 10, 2026

టెన్త్ పరీక్షల నిర్వహణపై శిక్షణ: డీఈవో

image

పదో తరగతి పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, ఎంఈవోలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు డీఈవో ప్రసాద్ బాబు తెలిపారు. అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల డ్రామా హాలులో టెన్త్ పరీక్షల నిర్వహణపై వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమ నిబంధనలను వారికి క్షుణ్ణంగా వివరించామన్నారు. టెన్త్ పరీక్ష కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు.

News March 10, 2026

యుద్ధ ప్రభావంతో ఆగిన అరటి ఎగుమతులు

image

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం అనంతపురం జిల్లా అరటి రైతులపై తీవ్రంగా పడింది. ఇరాన్, గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో టన్ను ధర రూ.22 వేల నుంచి రూ.9 వేలకు పడిపోయింది. వ్యాపారస్తులు కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో తోటల్లోనే పంట పండిపోతోంది. పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి నెలకొనడంతో రైతులు దిగులు చెందుతున్నారు. గిట్టుబాటు ధర లేక వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

News March 10, 2026

అనంత: ఉద్యోగుల సీనియారిటీ లిస్టులో తప్పులు..!

image

స్వర్ణ వార్డ్ సచివాలయ ఉద్యోగుల సీనియారిటీ లిస్ట్‌లో తప్పులు ఉన్నట్లు రిజర్వేషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాయలసీమ అధ్యక్షుడు ఆదినారాయణ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్లో PGRS కార్యక్రమంలో సచివాలయం ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా అధికారులకు వారు వినతి ఇచ్చారు. సీనియార్టీ లిస్టును సరిదిద్ది రిజర్వేషన్ ఎంప్లాయీస్‌కి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని కోరారు.