News March 16, 2024
అనంత: పదో తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం
ఈనెల 18 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు, పరీక్ష అనంతరం తిరిగి ఇంటికి చేరేందుకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు శనివారం అనంతపురం రీజనల్ మేనేజర్ సుమంత్ ఆర్.ఆదోని తెలిపారు. విద్యార్థులు పరీక్ష రోజుల్లో హల్ టికెట్ చూపించి అన్ని పల్లెవెలుగు, అల్ట్రా సర్వీసు బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు.
Similar News
News October 16, 2024
అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు
అల్పపీడన ప్రభావంతో అనంతపురం జిల్లాలో వర్షం పడుతోంది. నిన్నటి నుంచి కదిరి, రోళ్ల, ధర్మవరం, బుక్కపట్నం తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. మరోవైపు నేడు, రేపు జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లు నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కేంద్రాల్లో <<14360726>>కంట్రోల్ రూమ్స్<<>> ఏర్పాటు చేశారు.
News October 16, 2024
సత్యసాయి: నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి: కలెక్టర్
15 సంవత్సరాలు నిండిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. వయోజన విద్య అభివృద్ధిపై కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో మంగళవారం రాత్రి గూగుల్ మీట్ విధానం ద్వారా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.
News October 15, 2024
కంట్రోల్ రూమ్‌ను పరిశీలించిన సత్యసాయి జిల్లా జేసీ
శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పరిశీలించారు. అల్పపీడన పరిస్థితుల సమాచారాన్ని తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన టీవీ ద్వారా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం తెలపాలని కంట్రోల్ రూమ్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సూచించారు. విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.