News March 17, 2024

అనంత: భర్తపై భార్య గొడ్డలితో దాడి

image

ఉరవకొండ మండలం పెద్ద ముష్టూరులో ఆదివారం దారుణం చోటుచేసుకొంది. మద్యానికి బానిసైన ఓబులేశు నిత్యం వేదిస్తున్నాడని సహనం కోల్పోయిన భార్య లలితమ్మను గొడ్డలితో తల, మేడ భాగంలో దాడి చేసింది. అనంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది. క్షతగాత్రుడిని 108 వాహనంలో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తరలించారు.

Similar News

News January 24, 2026

అనంతపురం: భూముల మార్కెట్ విలువల సవరణపై జేసీ సమీక్ష

image

అనంతపురం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాలో భూముల మార్కెట్ విలువల సవరణపై శనివారం సమీక్ష నిర్వహించారు. మార్కెట్ వాల్యూ కమిటీ ఛైర్మన్ హోదాలో జిల్లా సంయుక్త కలెక్టర్ సి.విష్ణు చరణ్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సబ్ రిజిస్ట్రార్లు, మున్సిపల్ కమిషనర్లు, అహుడా అధికారులతో చర్చించారు. వ్యవసాయ, వ్యవసాయేతర, నివాస స్థలాల నూతన మార్కెట్ విలువలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.

News January 24, 2026

గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలి: DRO మలోల

image

గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని DRO మలోల అధికారులను ఆదేశించారు. శనివారం అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈనెల 26న ఉదయం 9 గంటలకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు జరుగుతాయని తెలిపారు. గ్రౌండ్ వైట్‌వాష్, విద్యుత్, శానిటేషన్, సాంస్కృతిక కార్యక్రమాలు, వైద్య శిబిరం, తదితర ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.

News January 24, 2026

అనంతపురం కలెక్టరేట్‌లో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం

image

అనంతపురం కలెక్టరేట్‌లో శనివారం స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ మలోలతో పాటు జిల్లా ఫారెస్ట్ అధికారి రామకృష్ణారెడ్డి, జిల్లా ట్రెజరీ అధికారి రమణయ్య, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. “జీరో గ్యాప్ సానిటేషన్ ఆంధ్ర” థీమ్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అనంతరం స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసి కార్యాలయ పరిసరాలు శుభ్రం చేశారు.