News November 26, 2024

ఆర్థికవేత్త పాలనలో ‘అరాచకం’!

image

ఎకనామిక్స్‌లో నోబెల్ పొందిన మహ్మద్ యూనస్ పాలనలో బంగ్లాదేశ్ మరింత అంధకారంలోకి వెళ్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే అదానీకి బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ లేక టెక్స్‌టైల్ ఇండస్ట్రీ పడకేసిందని పేర్కొన్నారు. ప్రజలకు ఉపాధి కరవైందన్నారు. మరోవైపు జమాతే ఇస్లామీ ఆయన దిగిపోవాలని అల్లర్లు చేస్తుండటాన్ని ఉదహరిస్తున్నారు. ఇక మైనార్టీల పరిస్థితి మరింత దిగజారిందని, దాడులు పెరిగాయని అంటున్నారు.

Similar News

News December 2, 2024

ఇళ్ల ధరల్లో పెరుగుదల ఇలా!

image

ఇండియాలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరల్లో గతేడాది నుంచి జరిగిన హెచ్చుతగ్గులను TNIE నివేదించింది. హౌసింగ్ ధరలు చదరపు గజానికి సగటున రూ.11వేలు ఉన్నట్లు తేలింది. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్‌, కోల్‌కతా, పుణే, ముంబైలలో 2023 Q3 నుంచి 2024 Q4 వరకు ఇళ్ల ధరలను పరిశీలించారు. HYDలో స్క్వేర్ ఫీట్‌కు రూ.11,040 నుంచి ఇప్పుడు రూ.11,351కి పెరిగింది. ఇక్కడ 3శాతం వృద్ధిరేటు కనిపించింది.

News December 2, 2024

నేడే ‘సైబర్ మండే’.. అంటే ఏమిటి?

image

ఈకామర్స్ సైట్లలో ఇవాళ సైబర్ మండే సేల్ నడుస్తోంది. అమెరికాలో నవంబర్ నాలుగో గురువారం ‘థ్యాంక్స్ గివింగ్ డే’ ఉంటుంది. ఆరోజు వ్యాపారులు భారీ ఆఫర్లు ఇస్తుంటారు. దీనికి పోటీగా ఆన్‌లైన్ షాపింగ్ పెంచేందుకు ఈ-రిటైలర్లు 2005లో ‘సైబర్ మండే’ ఆఫర్ సేల్ ప్రకటించారు. థ్యాంక్స్ గివింగ్ డే తర్వాతి సోమవారం ఇది ఉంటుంది (ఈసారి DEC 2). USA నుంచి ఇతర దేశాలకు పాకిన ఈ స్ట్రాటజీ ఇప్పుడు భారత్‌నూ తాకింది.

News December 2, 2024

లోక్‌సభ, రాజ్యసభ రేపటికి వాయిదా

image

పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇవాళ ఉదయం లోక్‌సభ, రాజ్యసభలు ప్రారంభం కాగానే అదానీ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. స్పీకర్, ఛైర్మన్ సముదాయించినా విపక్ష ఎంపీలు వినలేదు. అదానీ అంశంపై చర్చకు కేంద్రం ఎందుకు భయపడుతోందని ప్రశ్నిస్తూ నినాదాలు చేశారు. దీంతో ఉభయ సభలను స్పీకర్, ఛైర్మన్ రేపటికి వాయిదా వేశారు.