News March 29, 2024
ఇక మన ‘టైమ్’

భారత్‌లోని గడియారాలు, స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు ఇక నుంచి మన సొంత వ్యవస్థ ద్వారా పని చేయనున్నాయి. ఇందుకోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘రుబీడియం అటామిక్ క్లాక్’ను అభివృద్ధి చేసింది. త్వరలో గడియారాలు, స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లను ఈ అటామిక్ క్లాక్‌తో సింక్ చేయనున్నారు. కాగా ప్రస్తుతం భారత్‌లోని వ్యవస్థలు అమెరికా రూపొందించిన నెట్వర్క్ టైమ్ ప్రొటోకాల్‌ను అనుసరిస్తున్నాయి.
Similar News
News November 25, 2025
KNR: భవన నిర్మాణ కార్మికులకు అవగాహన సదస్సులు

భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై పది రోజుల పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఉప కార్మిక కమిషనర్ తెలిపారు. లేబర్ కమిషనర్ హైదరాబాద్ ఆదేశాల మేరకు డిసెంబర్ 3 వరకు ఈ సదస్సులు జరుగుతాయి. ప్రమాద బీమా, సహజ మరణం, పెళ్లి కానుక, ప్రసూతి లబ్ధి వంటి అంశాలపై నిర్వహించే ఈ సదస్సులను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News November 25, 2025
బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్: సుందర్

గువాహటి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమేనని భారత ఆల్‌రౌండర్ <<18375894>>వాషింగ్టన్<<>> సుందర్ అన్నారు. పరుగులు చేయకుండా ఎక్కువ సేపు నియంత్రించలేరని చెప్పారు. ‘ఇదేమీ బ్యాటింగ్‌కు కష్టమైన పిచ్ కాదు. ట్రూ వికెట్. ఇలాంటివి ఇండియాలో అరుదుగా ఉంటాయి. క్రీజ్‌లో నిలబడితే రన్స్ వస్తాయి’ అని తెలిపారు. 6 వికెట్లు తీసిన జాన్సెన్కు అసాధారణ బౌన్స్ రాలేదని, అతడు ఎత్తుగా ఉండటం వల్ల గుడ్ లెంత్‌లో బౌలింగ్ చేశారని పేర్కొన్నారు.
News November 25, 2025
మంచి జరగబోతోంది: ట్రంప్

రష్యా-ఉక్రెయిన్ పీస్ టాక్స్‌లో ముందడుగు పడినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హింట్ ఇచ్చారు. ‘శాంతి చర్చల విషయంలో పెద్ద పురోగతి సాధించడం సాధ్యమేనా? మీరు చూసే దాకా దీన్ని నమ్మకండి. కానీ ఏదో ఒక మంచి జరగబోతోంది’ అని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. కాగా యూఎస్ శాంతి ప్రతిపాదనను మెరుగుపరచాలని అంగీకరించినట్లు జెనీవా చర్చల తర్వాత అమెరికా, ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు.


