News March 29, 2024
ఇక మన ‘టైమ్’

భారత్‌లోని గడియారాలు, స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు ఇక నుంచి మన సొంత వ్యవస్థ ద్వారా పని చేయనున్నాయి. ఇందుకోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘రుబీడియం అటామిక్ క్లాక్’ను అభివృద్ధి చేసింది. త్వరలో గడియారాలు, స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లను ఈ అటామిక్ క్లాక్‌తో సింక్ చేయనున్నారు. కాగా ప్రస్తుతం భారత్‌లోని వ్యవస్థలు అమెరికా రూపొందించిన నెట్వర్క్ టైమ్ ప్రొటోకాల్‌ను అనుసరిస్తున్నాయి.
Similar News
News March 5, 2026
ఏ వివాదానికైనా సైనిక చర్య పరిష్కారం కాదు: మోదీ

దేశాల మధ్య సంఘర్షణను పరిష్కరించడానికి చట్టబద్ధ పాలన, చర్చలు, దౌత్యం ముఖ్యమని PM మోదీ చెప్పారు. రష్యాvsఉక్రెయిన్, US-ఇజ్రాయెల్vsఇరాన్ యుద్ధాలను ప్రస్తావిస్తూ.. ఏ వివాదానికైనా సైనిక చర్య పరిష్కారం కాదన్నారు. ఢిల్లీలో ఫిన్‌లాండ్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ స్టబ్‌తో కలిసి నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఈ కామెంట్లు చేశారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాలో శాంతి కోసం చేసే ప్రయత్నాలకు సపోర్ట్ చేస్తామని ప్రకటించారు.
News March 5, 2026
ఇరాన్ సంచలన ప్రకటన.. భారత్‌కు గుడ్‌న్యూస్!

హార్ముజ్ నుంచి అన్ని దేశాలకు చమురు సరఫరా నిలిపివేయట్లేదని ఇరాన్ స్పష్టం చేసింది. దీంతో INDతో పాటు మరికొన్ని దేశాలకు భారీ ఊరట లభించింది. త్వరలోనే మన షిప్స్ రవాణా మొదలవ్వొచ్చు. ఇక తమ నౌకాదళంతో హార్ముజ్‌లోని వాణిజ్య నౌకలకు రక్షణ కల్పిస్తామన్న US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనకు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. జలసంధిని నియంత్రించే అధికారం తమకుందని, US, ఇజ్రాయెల్, యూరప్ వెళ్లే నౌకలకు ఎంట్రీ ఉండదని తేల్చి చెప్పింది.
News March 5, 2026
జగన్ క్రిస్టియనా, కాదా? అచ్చెన్న వ్యాఖ్యలతో సభలో దుమారం

AP: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఇవాళ కూడా శాసనమండలిని కుదిపేస్తోంది. జగన్ క్రిస్టియనా కాదా? అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. నిన్న కూడా సభలో తాను ప్రశ్నించానని, 24 గంటలు గడిచినా జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అచ్చెన్న కామెంట్స్‌ను వ్యతిరేకిస్తూ YCP సభ్యులు నినాదాలతో ఆందోళనకు దిగారు. ఈ గందరగోళంతో ఛైర్మన్ మోషేన్ రాజు సభను 5 నిమిషాలు వాయిదా వేశారు.


