News November 11, 2024
IPLలో ధోనీలాగే ఆండర్సన్ కూడా: డివిలియర్స్
IPL వేలానికి ఇంగ్లండ్ పేసర్ ఆండర్సన్ తన పేరు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన్ను చూస్తే 40 ఏళ్ల తర్వాత కూడా ఫిట్‌గా IPL ఆడుతున్న ధోనీ గుర్తొస్తున్నారని ఆర్సీబీ మాజీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ అన్నారు. ‘42 ఏళ్ల వయసులో ఆండర్సన్ ఒకప్పటిలా బౌలింగ్ చేయలేకపోవచ్చు. బేస్ ప్రైజ్‌కి మించి అమ్ముడుకాకపోవచ్చు. కానీ యువ ఆటగాళ్లకు అతడి అనుభవం ఓ వరం. నేనే జట్టు ఓనర్‌నైతే కచ్చితంగా ఆండర్సన్‌ను కొంటా’ అని పేర్కొన్నారు.
Similar News
News December 7, 2024
18న గురుకుల సొసైటీ ప్రవేశాలకు నోటిఫికేషన్
TG: గురుకుల సొసైటీ ప్రవేశాలకు ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి తెలిపారు. ఫిబ్రవరి 23న రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు. జూన్ 12లోగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అలాగే 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రవేశాలకు ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించడం లేదని వెల్లడించారు. పది పాసైన వారికి నేరుగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు కల్పిస్తామన్నారు.
News December 7, 2024
తెలంగాణలోనే ఎక్కువ సిజేరియన్లు
తెలంగాణలో సిజేరియన్లు ఎక్కువగా ఉన్నట్లు NFHS ఆధారంగా ఢిల్లీలోని జార్జ్ ఇన్‌స్టిట్యూట్ స్టడీ తెలిపింది. ఇక్కడ మొత్తం ప్రసవాల్లో 60.7% సిజేరియన్లేనని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇది 21.5 శాతంగా ఉంది. అత్యల్పంగా నాగాలాండ్‌లో 5.2% సిజేరియన్లు జరుగుతున్నాయి. దక్షిణాదిలోనే సిజేరియన్లు ఎక్కువగా ఉన్నాయి. సహజ ప్రసవాలపై భయం, ముహూర్తాలు చూసుకోవడం, ఆర్థిక స్తోమత వంటి అంశాలు సిజేరియన్లకు కారణాలవుతున్నాయి.
News December 7, 2024
TFDC ఛైర్మన్‌గా నిర్మాత దిల్ రాజు
TG: సినీ నిర్మాత దిల్ రాజుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రాజును నియమిస్తూ CS శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగుతారు. కాగా గత ఎన్నికల్లో దిల్ రాజు కాంగ్రెస్ తరఫున MP లేదా MLAగా పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగలేదు. తెర వెనుక ఆయన కాంగ్రెస్‌కు మద్దతిచ్చినట్లు టాక్.