News December 7, 2024
ఏంజెలో మాథ్యూస్ అరుదైన ఘనత
శ్రీలంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ అరుదైన ఘనత సాధించారు. టెస్టుల్లో యాక్టివ్ ప్లేయర్లలో అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాటర్‌గా మాథ్యూస్ నిలిచారు. ఇప్పటివరకు ఆయన 8,006 పరుగులు చేశారు. అగ్ర స్థానంలో జో రూట్ (12,780) ఉన్నారు. ఆ తర్వాత స్టీవ్ స్మిత్ (9,702), విరాట్ కోహ్లీ (9,152), విలియమ్సన్ (9,072) వరుసగా ఉన్నారు. అలాగే టెస్టుల్లో 8,000 పరుగులు పూర్తి చేసుకున్న మూడో బ్యాటర్‌గానూ రికార్డులకెక్కారు.
Similar News
News January 24, 2025
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాపై హైకోర్టులో పిల్!
విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. సినిమా బడ్జెట్, కలెక్షన్ల విషయంలో క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని పిటిషనర్ పేర్కొన్నారు. అదనపు షోల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై ఐటీ, ఈడీ, జీఎస్టీ అధికారులతో విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
News January 24, 2025
VIRAL: విపరీతమైన చలి.. ఏనుగులకు స్వెటర్లు
చలి విపరీతంగా పెరిగిపోవడంతో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో పొగ మంచు కప్పేస్తోంది. దీంతో మూగ జీవాలు సైతం వణికిపోతున్నాయి. ఈక్రమంలో ప్రతి ఏటా మథురలోని వైల్డ్‌లైఫ్ రెస్క్యూ & రిహాబిలిటేషన్ ఆర్గనైజేషన్ రెస్క్యూ చేసిన ఏనుగులకు స్వెటర్లు వేస్తుంటుంది. బ్లాంకెట్స్ & మహిళలు నేసిన ఊలు స్వెటర్లు ధరించడంతో ఏనుగులు ఎంతో అందంగా కనిపిస్తుంటాయి.
News January 24, 2025
ముగిసిన గ్రామ సభలు.. నెక్స్ట్ ఏంటి?
TG: ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల లబ్ధిదారుల కోసం నిర్వహించిన గ్రామ సభలు ముగిశాయి. అధికారులు ఎంపికైన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సర్వే చేసి వారి ఆర్థిక స్థితిగతులు తెలుసుకుంటారు. లబ్ధిదారులపై ఎవరైనా అభ్యంతరాలు తెలిపితే ఎంక్వైరీ చేస్తారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.