News March 31, 2024

టీసీఎస్‌పై అమెరికా ఉద్యోగుల ఆగ్రహం

image

భారత ఐటీ దిగ్గజం టీసీఎస్‌పై అమెరికా ఉద్యోగులు మండిపడుతున్నారు. తమపై సంస్థ వివక్ష చూపుతోందని, తమను తొలగించి భారతీయులను నియమించుకుంటోందని తాజాగా ఆరోపించారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. 22మంది ఉద్యోగులు సమాన ఉద్యోగ అవకాశాల కమిషన్‌కు సంస్థపై ఫిర్యాదు చేశారు. అయితే, ఆ ఆరోపణల్ని టీసీఎస్ కొట్టిపారేసింది. ఉద్యోగులకు సమాన అవకాశాల్ని కల్పించడంపై కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పింది.

Similar News

News January 2, 2025

భారత్-పాక్ మధ్య అణు స్థావరాల సమాచార మార్పిడి

image

30 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం భారత్, పాక్ తమ అణు స్థావరాల సమాచారాన్ని మార్పిడి చేసుకున్నాయి. దౌత్య మార్గాల ద్వారా ఏక కాలంలో ఈ ప్రక్రియ పూర్తయినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. అలాగే మత్స్యకార ఖైదీలు, కశ్మీర్, సీమాంతర ఉగ్రవాదంపైనా సమాచార మార్పిడి జరిగినట్లు వెల్లడించింది. అణు స్థావరాలపై దాడులకు వ్యతిరేకంగా కుదిరిన ఒప్పందం ప్రకారం 1992 నుంచి ఏటా జనవరి 1న ఈ కార్యక్రమం జరుగుతోంది.

News January 2, 2025

తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు విటిలిగో వ్యాధి

image

మిల్కీ బ్యూటీ తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ అరుదైన చర్మ సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. దీనిని కాస్మోటిక్ మేకప్‌తో కవర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. విటిలిగో(బొల్లి) అనే చర్మ సమస్యతో తాను సతమతమవుతున్నట్లు తెలిపారు. మొదట్లో ఈ విషయమై భయపడినా సినిమాల్లో బిజీ అవడంతో మరిచిపోయినట్లు చెప్పారు. కాగా విటిలిగో అంటు వ్యాధి కాకపోయినా దీనికి కచ్చితమైన నివారణ లేదు.

News January 2, 2025

GST: APలో 6 శాతం తగ్గుదల.. TGలో 10 శాతం పెరుగుదల

image

2024 డిసెంబర్‌లోనూ ఏపీలో <>జీఎస్టీ వసూళ్లు<<>> 6 శాతం మేర తగ్గాయి. 2023 DECలో రూ.3,545 కోట్లు వసూలవగా, ఈసారి రూ.3,315 కోట్లే నమోదైంది. గత నవంబర్‌లోనూ 10 శాతం మేర జీఎస్టీ వసూళ్లు తగ్గిన విషయం తెలిసిందే. ఇక తెలంగాణలో 10 శాతం వృద్ధి నమోదైంది. 2023 DECలో రూ.4,753 కోట్లు వసూలవగా, ఈసారి రూ.5,224 కోట్లు వచ్చింది.