News January 2, 2025

భారత్-పాక్ మధ్య అణు స్థావరాల సమాచార మార్పిడి

image

30 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం భారత్, పాక్ తమ అణు స్థావరాల సమాచారాన్ని మార్పిడి చేసుకున్నాయి. దౌత్య మార్గాల ద్వారా ఏక కాలంలో ఈ ప్రక్రియ పూర్తయినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. అలాగే మత్స్యకార ఖైదీలు, కశ్మీర్, సీమాంతర ఉగ్రవాదంపైనా సమాచార మార్పిడి జరిగినట్లు వెల్లడించింది. అణు స్థావరాలపై దాడులకు వ్యతిరేకంగా కుదిరిన ఒప్పందం ప్రకారం 1992 నుంచి ఏటా జనవరి 1న ఈ కార్యక్రమం జరుగుతోంది.

Similar News

News January 14, 2025

భారీగా ప‌త‌న‌మైన HCL స్టాక్స్

image

Q3 ఫ‌లితాలు మెరుగ్గా ఉన్నప్పటికీ దేశంలో మూడో అతిపెద్ద‌ IT దిగ్గ‌జం HCL Technologies షేర్లు మంగ‌ళ‌వారం భారీగా న‌ష్ట‌పోయాయి. గ‌త సెష‌న్‌లో స్థిర‌ప‌డిన ₹1,975 నుంచి ₹1,819 వ‌ర‌కు 8.52% మేర ప‌త‌న‌మ‌య్యాయి. Q3లో ₹4,591 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసిన సంస్థ‌ గత క్వార్టర్ కంటే 8.5% వృద్ధిని నమోదు చేసింది. ఫ‌లితాలు ఆశించిన మేర లేక‌పోవ‌డం, కంపెనీ ఫ్యూచ‌ర్‌ ప్లాన్స్ కూడా ఇన్వెస్ట‌ర్ల‌ను మెప్పించ‌లేక‌పోయాయి.

News January 14, 2025

ఇంగ్లండ్ సిరీసుకు టీమ్ సైజ్ తగ్గించండి: గవాస్కర్

image

ఇంగ్లండ్ టెస్టు సిరీసుకు టీమ్ సైజును తగ్గించాలని టీమ్ఇండియా లెజెండ్ సునీల్ గవాస్కర్ సలహా ఇచ్చారు. 16 కన్నా ఎక్కువ మందిని ఎంపిక చేయడం సెలక్టర్ల అపనమ్మకాన్ని సూచిస్తోందన్నారు. ఆసీస్‌కు 19 మందిని పంపించడం తెలిసిందే. ఎక్కువ మందిని పంపే స్తోమత BCCIకి ఉన్నా టీమ్ఇండియా క్యాప్‌ ఈజీగా ఇచ్చేయొచ్చని కాదన్నారు. విదేశాల్లో ప్రాక్టీస్ మ్యాచులు ఎక్కువ ఆడాలని, ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్స్ తీసేయాలని చెప్పారు.

News January 14, 2025

ఈ ఏడాదీ బాదుడే.. పెరగనున్న రీఛార్జ్ ధరలు?

image

గత ఏడాది 25 శాతం వరకు టారిఫ్‌లను పెంచిన టెలికం కంపెనీలు కొత్త సంవత్సరంలోనూ బాదుడుకు సిద్ధమైనట్లు సమాచారం. దాదాపు 10 శాతం ధరలను పెంచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 5G సేవలకు నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టవచ్చని పేర్కొంటున్నాయి. ధరల పెంపుతో జియో, ఎయిర్‌టెల్, VIల యావరేజ్ రెవెన్యూ కనీసం 25 శాతం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.