News October 20, 2024

సర్ఫరాజ్‌పై అనిల్ కుంబ్లే ప్రశంసలు

image

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో 150 పరుగులతో రాణించిన సర్ఫరాజ్ ఖాన్‌పై మాజీ ప్లేయర్ అనిల్ కుంబ్లే ప్రశంసలు కురిపించారు. కివీస్ స్పిన్నర్లపై సర్ఫరాజ్ ఆధిపత్యం చెలాయించారని, పేస్ బౌలింగ్‌లోనూ నిలకడగా ఆడారని కొనియాడారు. బౌలర్లపై ఎలా ప్రెజర్ తీసుకురావాలో అతనికి బాగా తెలుసన్నారు. అతను ఎక్కువగా క్రీజులో నుంచి కదలకుండా గేమ్ ప్లాన్ అమలు చేస్తారని అన్నారు. కాగా రెండో ఇన్నింగ్సులో భారత్ 462 రన్స్ చేసింది.

Similar News

News November 22, 2025

వనజీవి జీవితంపై సినిమా మొదలు!

image

తెలంగాణ ‘వనజీవి’గా పేరుగాంచిన పద్మశ్రీ అవార్డు గ్రహీత రామయ్య జీవిత చరిత్ర సినిమా రూపంలో తెరకెక్కనుంది. ఖమ్మంలో ఈ బయోపిక్‌ను లాంఛనంగా ప్రారంభించారు. వనజీవి రామయ్య తన జీవితాన్ని లక్షలాది మొక్కలను నాటడానికి, రక్షించడానికి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆదర్శవంతమైన, నిరాడంబర జీవన విధానం, పర్యావరణ భక్తిని ఈ సినిమా వెండితెరపైకి తీసుకురానుంది. ఆయన పాత్రలో నటుడు బ్రహ్మాజీ కనిపించనున్నారు.

News November 22, 2025

క్షమాపణలు చెప్పిన అల్‌-ఫలాహ్‌ వర్సిటీ

image

ఢిల్లీ పేలుడు ఘటనలో అల్‌-ఫలాహ్‌ వర్సిటీ పేరు రావడంతో, వారి వెబ్‌సైట్‌లో ఉన్న పాత అక్రిడిటేషన్‌ వివరాలపై NAAC షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై వర్సిటీ స్పందిస్తూ వెబ్‌సైట్ డిజైన్‌ లోపాలు కారణంగా ఈ పొరపాట్లు జరిగాయని క్షమాపణలు తెలిపింది. తప్పుడు సమాచారాన్ని తొలగించినట్లు పేర్కొంది. కాగా గడువు ముగిసిన తరువాత కూడా వర్సిటీ గ్రేడ్‌లను తమ సైట్‌లో కొనసాగిస్తూ వచ్చింది.

News November 22, 2025

జల, వాయు మార్గాల ద్వారా భారత్-అఫ్గాన్ ట్రేడ్

image

భారత్-అఫ్గాన్ మధ్య సంబంధాలు బలోపేతమవుతున్నాయి. పాక్ రోడ్డు మార్గం మూసేయడంతో జల, వాయు మార్గాల ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవుతోపాటు రెండు ప్రత్యేక కార్గో విమానాలను ఉపయోగించుకోనున్నట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. ప్రస్తుతం IND-AFG మధ్య బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుండగా, భవిష్యత్తులో మరింత పెంచనున్నాయి.