News October 20, 2024

సర్ఫరాజ్‌పై అనిల్ కుంబ్లే ప్రశంసలు

image

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో 150 పరుగులతో రాణించిన సర్ఫరాజ్ ఖాన్‌పై మాజీ ప్లేయర్ అనిల్ కుంబ్లే ప్రశంసలు కురిపించారు. కివీస్ స్పిన్నర్లపై సర్ఫరాజ్ ఆధిపత్యం చెలాయించారని, పేస్ బౌలింగ్‌లోనూ నిలకడగా ఆడారని కొనియాడారు. బౌలర్లపై ఎలా ప్రెజర్ తీసుకురావాలో అతనికి బాగా తెలుసన్నారు. అతను ఎక్కువగా క్రీజులో నుంచి కదలకుండా గేమ్ ప్లాన్ అమలు చేస్తారని అన్నారు. కాగా రెండో ఇన్నింగ్సులో భారత్ 462 రన్స్ చేసింది.

Similar News

News November 10, 2024

నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతోన్న ‘దేవర’

image

ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ OTTలో అదరగొడుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో ఈ సినిమా నంబర్ వన్ ట్రెండింగ్‌లో నిలిచింది. కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు టాక్.

News November 10, 2024

రేవంత్‌వి అన్నీ బోగస్ మాటలే: హరీశ్ రావు

image

TG: CM రేవంత్ అన్ని వర్గాలను మోసం చేశారని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. చెప్పేవన్నీ బోగస్ మాటలేనని ఆయన విమర్శించారు. ‘రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు.. నియామకాలు లేవు, నిరుద్యోగ భృతి ఏమైంది. రూ.4 వేల పెన్షన్ రాలేదు. మహిళలకు రూ.2,500 ఏవీ? 40 లక్షల మందికి రుణమాఫీ చేశారనేది బోగస్. రైతుభరోసా అందలేదు. వరిపంటకు బోనస్ ఇవ్వలేదు. రేవంత్ అబద్ధాల ప్రచారం మహారాష్ట్రలో కూడా కొనసాగిస్తున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News November 10, 2024

దక్షిణాప్రికా, భారత్ రెండో టీ20కి వర్షం ముప్పు

image

సౌతాఫ్రికా, భారత్ మధ్య గెబేహా వేదికగా రాత్రి 7.30గం.లకు జరిగే రెండో T20 మ్యాచ్‌‌కి వర్షం ముప్పు పొంచి ఉంది. టాస్‌కు సైతం ఇబ్బంది కలిగే అవకాశముంది. వర్షం కారణంగా ఆటను పూర్తిగా కొనసాగించలేని పరిస్థితి ఎదురైతే, 5 ఓవర్లకు కుదించి మ్యాచ్ ఆడిస్తారు. అది కూడా సాధ్యం కాకపోతే మ్యాచ్‌ను రద్దు చేస్తారు. ఇప్పటికే భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. మ్యాచ్ రద్దయితే మిగతా 2 మ్యాచుల్లో ఒకటి గెలిచినా సిరీస్ మనదే అవుతుంది.