News March 28, 2025
విషమంగా అంజలి ఆరోగ్యం.. నిందితుడు అరెస్ట్

AP: ఓ వ్యక్తి చేతిలో మోసపోయానంటూ రాజమండ్రిలో <<15894441>>ఆత్మహత్యాయత్నం<<>> చేసిన ఫార్మసీ విద్యార్థిని అంజలి(23) ఆరోగ్యం విషమంగానే ఉంది. ఆమె బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని, నేచురల్‌గానే రికవరీ అవ్వాలని వైద్యులు చెబుతున్నారు. సూసైడ్ నోటు ఆధారంగా మాధవరావు దీపక్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. అంజలికి మెరుగైన వైద్యం అందించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని తోటి విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు.
Similar News
News March 31, 2025
10 నెలల్లో రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు: లోకేశ్

గత 10 నెలల్లో ఏపీకి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి లోకేశ్ తెలిపారు. విశాఖ బీచ్ రోడ్డులో తాజ్ వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన హోటల్, ఆఫీస్ టవర్‌కు తల్లి భువనేశ్వరితో కలిసి భూమిపూజ చేశారు. గత పాలకులు విధ్వంసక విధానాలతో వ్యాపార వాతావరణానికి నష్టం కలిగించారని లోకేశ్ విమర్శించారు. తాము విశాఖను ఐటీ హబ్‌గా మార్చి రాబోయే ఐదేళ్లలో యువతకు 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
News March 31, 2025
భూకంపం.. మసీదులు కూలి 700 మంది మృతి

గత శుక్రవారం మయన్మార్‌లో వచ్చిన భూకంపానికి మసీదులు కూలి ప్రార్థనలు చేస్తున్న 700 మందికి పైగా మరణించారని ఓ ముస్లిం సంఘ ప్రతినిధులు వెల్లడించారు. 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపానికి సుమారు 60 మసీదులు ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. ముఖ్యంగా పాత మసీదు భవనాలపై ఎక్కువ ప్రభావం పడిందని వివరించారు. కాగా, ఆ దేశంలో మొత్తం భూకంపం మృతుల సంఖ్య 1700 దాటింది.
News March 31, 2025
తిరుమల శ్రీవారికి నిద్ర లేకుండా చేస్తున్నారు: రోజా

AP: కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, తిరుమల శ్రీవారికీ నిద్ర లేకుండా పోతోందని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. ‘సంప్రదాయాల ప్రకారం భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలి. ప్రస్తుతం రోజుకు దాదాపు 10వేల VIP బ్రేక్ దర్శనాలకు ప్రాధాన్యమిస్తూ స్వామికి నిద్ర లేకుండా చేస్తున్నారు. మరోవైపు సాధారణ భక్తుల దర్శనాలను తగ్గించారు. ఇదేనా పవన్, BJPల సనాతన ధర్మం?, ఇదేనా చంద్రబాబు నమూనా ప్రక్షాళన?’ అని ప్రశ్నించారు.