News August 15, 2024
అన్నక్యాంటీన్లు: రోజుకు ఎంత ఖర్చో తెలుసా?
CM చంద్రబాబు ఇవాళ 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. సెప్టెంబర్ చివరి నాటికి 203 క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ క్యాంటీన్ల నిర్వహణకు రోజుకు రూ.53 లక్షల ఖర్చు అవుతుందని ప్రభుత్వం వెల్లడించింది. అల్పాహారానికి రూ.22, మధ్యాహ్న, రాత్రి భోజనానికి కలిపి రూ.68 ఖర్చుతో ఒక్కరికి మూడు పూటలకు రూ.90 అవుతుందని పేర్కొంది. తినేవారు రూ.15 చెల్లిస్తే మిగతా రూ.75 ప్రభుత్వం, దాతలు ఖర్చు పెడతాయి.
Similar News
News September 13, 2024
పవర్‌ప్లేలో ‘హెడ్’ మాస్టరే..!
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్నారు. ఈ ఏడాది పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా హెడ్ కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఆయన 192.32 స్ట్రైక్ రేట్‌తో 1,027 పరుగులు బాదారు. అతడి తర్వాత ఫిల్ సాల్ట్ (827), డుప్లెసిస్ (807), అలెక్స్ హేల్స్ (792), జేమ్స్ విన్స్ (703) ఉన్నారు. ఓవరాల్‌గా ఈ ఏడాది హెడ్ 181.36 స్ట్రైక్ రేట్‌తో 1,411 రన్స్ సాధించారు.
News September 13, 2024
నేడు పిఠాపురానికి వైఎస్ జగన్
AP: వరద బాధితులను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ కాకినాడ జిల్లా పిఠాపురం రానున్నారు. నియోజకవర్గంలోని మాధవపురం, రమణక్కపేటలో ప్రజలు, రైతులతో సమావేశమవుతారు. అలాగే ఏలేరు వరద ఉద్ధృతితో అతలాకుతలమై నీటమునిగిన పొలాలను ఆయన పరిశీలిస్తారు. అనంతరం ఆయన తాడేపల్లికి చేరుకుంటారు.
News September 13, 2024
మూత్రం, మురుగు నీటి నుంచి బీర్ తయారీ!
సింగపూర్‌లో న్యూబ్రూ అనే కంపెనీ బీర్‌ను తయారుచేస్తుంటుంది. ఆ బీర్ రుచి ఇతర కంపెనీల మాదిరిగానే ఉన్నా వాస్తవంగా మూత్రం, మురుగునీటి నుంచి శుద్ధి చేసిన నీటి నుంచి దాన్ని తయారు చేస్తున్నారు. సింగపూర్ ప్రభుత్వం దేశ డ్రైనేజీల్ని రీసైకిల్ చేసి ‘నెవాటర్’ అనే తాగునీటిని ఉత్పత్తి చేస్తోంది. ఆ నీటినే న్యూబ్రూ వాడుతోంది. తయారీలో అంతర్జాతీయ ప్రమాణాల్ని అనుసరిస్తున్నామని సంస్థ వినియోగదారులకు హామీ ఇస్తోంది.