News September 13, 2024

వ్యాపారవేత్తకు అన్నామలై క్షమాపణలు

image

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తమిళనాడు శ్రీ అన్నపూర్ణ రెస్టారెంట్ ఓనర్ శ్రీనివాసన్ క్షమాపణలు చెబుతున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తిగతమైన వీడియో బయటికి వెళ్లడం బాధాకరమని పేర్కొన్నారు. శ్రీనివాసన్‌కు ఫోన్ చేసి మాట్లాడానని, తమిళనాడు వ్యాపార వర్గాల్లో ఆయన ఓ దిగ్గజమని ఈ సందర్భంగా అన్నామలై కొనియాడారు.

Similar News

News December 5, 2025

పట్టిసం ఫెర్రీ రేవులో మృతదేహం లభ్యం

image

పోలవరం మండలంలోని పట్టిసం ఫెర్రీ రేవు వద్ద గోదావరిలో గురువారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న స్టేషన్‌ రైటర్‌ భీమశంకర్‌ మృతదేహాన్ని వెలికి తీయించి, పోస్టుమార్టం నిమిత్తం పోలవరం ఆసుపత్రికి తరలించారు. మృతుడు నీలిరంగు చొక్కా, కాకీ ప్యాంట్‌ ధరించి ఉన్నారని పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు తమకు సమాచారం అందించాలని కోరారు.

News December 5, 2025

స్క్రబ్ టైఫస్ వ్యాధి.. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

image

స్క్రబ్ టైఫస్‌ను వ్యాప్తి చేసే పురుగు పొలాలు, అడవులు, పశుగ్రాసం, తడి నేలల్లో ఎక్కువగా ఉంటోంది. పొలం పనులకు, పశుగ్రాస సేకరణకు వెళ్లే రైతులు తప్పనిసరిగా రబ్బరు బూట్లు, కాళ్లు, చేతులు పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తడిసిన దుస్తులు ధరించొద్దు. పొలాల్లో, పశువుల కొట్టాల్లో పనిచేసేటప్పుడు ఏదైనా పురుగు కుట్టి నొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులుంటే ఆస్పత్రికి తప్పక వెళ్లండి.

News December 5, 2025

అవినీతి అధికారి గుట్టు రట్టు.. రూ.100కోట్లకు పైగా ఆస్తులు!

image

తెలంగాణ ACB మరో అవినీతి అధికారిని పట్టుకుంది. రంగారెడ్డి(D) సర్వే సెటిల్మెంట్&భూ రికార్డుల ఆఫీసులో ADగా పనిచేస్తున్న కొంతం శ్రీనివాసులుపై అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. అతనికి HYDలో ఒక ఫ్లాట్, MBNRలో 4 ప్లాట్లు, NRPTలో రైస్ మిల్లు, 3 ప్లాట్లు, అనంతపురం, కర్ణాటకలో 22 ఎకరాల వ్యవసాయ భూమి, రెండు 4 వీలర్ వాహనాలు, 1.6kgs బంగారం, 770gms వెండి ఉన్నట్లు గుర్తించింది. వీటి వాల్యూ ₹100Cr+ ఉంటుందని అంచనా.