News August 14, 2025

సెలవులు రద్దు చేస్తూ ప్రకటన

image

తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో వైద్య సిబ్బందికి 3 రోజులపాటు ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. రానున్న మూడ్రోజుల పాటు ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సూపరింటెండెంట్లు, RMOలు, వైద్యాధికారులు, వైద్యులు, సిబ్బంది కచ్చితంగా ఆస్పత్రిలోనే ఉండాలని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో‌ వచ్చే రోగులకు, గర్భిణులకు తక్షణమే వైద్య‌ సేవలు అందించాలన్నారు.

Similar News

News August 14, 2025

వార్-2 VS కూలీ.. ఏ మూవీకి వెళ్లారు?

image

NTR, హృతిక్‌ల ‘వార్-2’, రజినీకాంత్ ‘కూలీ’ సినిమాల బాక్సాఫీస్ ఫైట్ మొదలైంది. భారీ అంచనాల మధ్య ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ రెండు యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్నాయి. కానీ ఫ్యాన్స్‌‌కు మాత్రం అదిరిపోయే ఎక్స్‌‌పీరియన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమ అభిమాన హీరోల స్క్రీన్ ప్రజెన్స్‌తో కడుపునిండిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఏ మూవీకి వెళ్లారు? ఎలా అనిపించింది? COMMENT

News August 14, 2025

యువతిపై గ్యాంగ్‌రేప్.. 10 మంది అరెస్ట్

image

TG: స్నేహం, ప్రేమ అంటూ యువతి(18)ని నమ్మించి ఆమెపై 10 మంది అత్యాచారానికి పాల్పడిన ఘటన జనగామలో సంచలనం సృష్టించింది. తొలుత ఓ యువకుడు ప్రేమ పేరుతో దగ్గరై అఘాయిత్యానికి పాల్పడగా, జూన్‌లో అతడి స్నేహితులూ ఆమెకు దగ్గరయ్యారు. మాట్లాడుకుందామని పిలిచి కారులో ఓ రూమ్‌కు తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు ఆమెను శారీరకంగా వాడుకున్నారు. తన చిన్నమ్మ సాయంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు అరెస్టయ్యారు.

News August 14, 2025

నటుడు దర్శన్ బెయిల్ రద్దు

image

రేణుకాస్వామి హత్య కేసులో నిందితులైన కన్నడ నటుడు దర్శన్‌, పవిత్ర గౌడ సహా మరో ఐదుగురికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కర్ణాటక హైకోర్టు వారికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేస్తూ తాజాగా తీర్పు ఇచ్చింది. తక్షణమే వారిని అదుపులోకి తీసుకోవాలని ఆ రాష్ట్ర పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. కాగా వారికి కర్ణాటక హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.