News August 14, 2025
సెలవులు రద్దు చేస్తూ ప్రకటన

తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో వైద్య సిబ్బందికి 3 రోజులపాటు ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. రానున్న మూడ్రోజుల పాటు ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సూపరింటెండెంట్లు, RMOలు, వైద్యాధికారులు, వైద్యులు, సిబ్బంది కచ్చితంగా ఆస్పత్రిలోనే ఉండాలని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు, గర్భిణులకు తక్షణమే వైద్య సేవలు అందించాలన్నారు.
Similar News
News April 18, 2026
ట్రంప్‌కు పంచ్.. హార్ముజ్‌పై బాంబు పేల్చిన ఇరాన్

హార్ముజ్‌ను తెరవడంపై ఇరాన్ మెలిక పెట్టింది. జలసంధిని US దిగ్బంధిస్తే తాము మళ్లీ మూసివేస్తామని ఇరాన్ నేత గాలిబాఫ్ ప్రకటించారు. ప్రయాణించే నౌకలు తమ అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. హార్ముజ్ తెరవడమా, మాసివేయడమా అనేది క్షేత్రస్థాయిలో నిర్ణయిస్తామని, SMలో కాదంటూ ట్రంప్‌పై సెటైర్ వేశారు. అబద్ధాలు చెప్పి ఆయన యుద్ధంలో గెలవలేరని, ఇలా మాట్లాడితే శాంతి చర్చల్లోనూ ఏమీ సాధించలేరని చురకలంటించారు.
News April 18, 2026
ALERT: ఎండలో బయటికెళ్తున్నారా?

ఉష్ణోగ్రతలు పెరగడంతో వడదెబ్బ పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విపరీతమైన తలనొప్పి, 104 డిగ్రీలకు పైగా జ్వరం, వాంతులు, శ్వాస వేగంగా తీసుకోవడం, చర్మం ఎర్రబడి పొడిగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తే నెగ్లెక్ట్ చేయొద్దని చెబుతున్నారు. నివారణకు తరచుగా నీరు, ORS తాగాలని, మధ్యాహ్నం వేళ ప్రయాణాలు తగ్గించి, లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. SHARE IT
News April 18, 2026
రష్యా చమురు కొనుగోలుకు US అనుమతుల పొడిగింపు

రష్యా నుంచి భారత్ సహా ఇతర దేశాలు చమురు కొనుగోలు చేయడానికి ఇచ్చిన అనుమతులను అమెరికా మరో నెల రోజులపాటు పొడిగించింది. మే 16 వరకు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. ఇది ఇరాన్, క్యూబా, ఉ.కొరియాతో జరిగే లావాదేవీలకు వర్తించదని పేర్కొంది. యుద్ధం కారణంగా పెరిగిన ఇంధన ధరలను నియంత్రించడానికి US ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా అనుమతులను పొడిగించబోమని 2రోజుల క్రితం US చెప్పడం గమనార్హం.


