News April 5, 2024

వైసీపీ అభ్యర్థి ఆస్తుల వేలానికి ప్రకటన

image

AP:ఎమ్మిగనూరు YCP MLA అభ్యర్థి బుట్టా రేణుక ఆస్తుల వేలానికి LIC హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఆమె భాగస్వామిగా ఉన్న బుట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మరికొన్ని సంస్థల ఆస్తులను మే 6న వేలం వేయనుంది. కొన్నేళ్ల క్రితం LIC హౌసింగ్ నుంచి వ్యాపార అవసరాల కోసం రూ.340 కోట్ల రుణం తీసుకోగా.. నష్టాలు రావడంతో బకాయిలు పేరుకుపోయాయి. దీంతో LIC వేలం ప్రకటన ఇవ్వగా, దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని ఆమె తెలిపారు.

Similar News

News February 1, 2026

వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలి: కలెక్టర్

image

కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ శనివారం విలేకరులకు కీలక సూచనలు చేశారు. స్థానిక కమ్మ జన సేవా సమితి కళ్యాణ మండపంలో జర్నలిస్టులకు పునశ్చరణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ ఆలపాటి సురేశ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభమని, వాస్తవాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వార్తలను ప్రచురించాలని కోరారు.

News February 1, 2026

చీకటి లేని జిల్లాగా తీర్చిదిద్దుదాం: మంత్రి గొట్టిపాటి

image

భీమవరం కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో విద్యుత్ సరఫరా లేని కాలనీలను వెంటనే గుర్తించి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, మంత్రి రామానాయుడు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

News February 1, 2026

TODAY HEADLINES

image

* APR 30కి అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తి
* ఫిబ్రవరి 12న బ్యాంకులు బంద్!
* దేవతల వన ప్రవేశం.. ముగిసిన మేడారం జాతర
* మున్సి‘పోల్స్’.. రెబల్స్ ఉండకూడదు: రేవంత్
* రేపు కేంద్ర బడ్జెట్: 47 డిమాండ్లు అందించిన TG
* నాకు సిట్ ఇచ్చిన నోటీసు అక్రమం.. KCR లేఖ
* CMపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి అరెస్ట్
* త్వరలో అందరికీ ₹2.5L వరకు ఉచిత వైద్యం: CBN
* రూ.5వేల కోట్ల భూములను లాగేశారు: జగన్