News April 25, 2024

ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన

image

ఏపీలో మరో 3 MP, 11 MLA స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది.
MP స్థానాలు: నరసాపురం-బ్రహ్మానందరావు నాయుడు, రాజంపేట్- SK బషీద్, చిత్తూరు-M.జగపతి
MLA స్థానాలు: చీపురుపల్లి-ఆదినారాయణ, శృంగవరపుకోట-G.తిరుపతి, విజయవాడ(W)-P.నాంచారయ్య, తెనాలి-సాంబశివుడు, బాపట్ల-అంజిబాబు, సత్తెనపల్లి-చంద్రపాల్, కొండపి-P.సుధాకర్, మార్కాపురం-జావేద్, కర్నూల్-షేక్ బాషా, ఎమ్మిగనూరు-ఖాసీం వలి, మంత్రాలయం-మురళీ కృష్ణరాజు.

Similar News

News January 14, 2025

తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్

image

హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ సీజేగా ఉన్న జస్టిస్ ఆలోక్ అరాధే బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇటీవల సీజేల బదిలీలకు సుప్రీం కొలీజియం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.

News January 14, 2025

అధికారుల తీరుపై మంత్రి పొన్నం నిరసన

image

TG: హన్మకొండ జిల్లా కొత్తకొండ జాతరకు హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన రాగానే అక్కడి ఏర్పాట్లపై భక్తులు ఫిర్యాదు చేశారు. కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చెప్పారు. అధికారుల తీరుపై కోపంతో మంత్రి వసతి గృహం వద్ద నేలపై కూర్చున్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు గర్భగుడిలోకి వెళ్లలేదు. అనంతరం ప్రెస్‌మీట్లో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు.

News January 14, 2025

మా వాళ్లను విడుద‌ల‌ చేయండి.. ర‌ష్యాను కోరిన భార‌త్

image

ర‌ష్యా సైన్యంలో ప‌నిచేస్తున్న త‌మ పౌరుల‌ విడుదలను వేగవంతం చేయాలని భార‌త్ మ‌రోసారి కోరింది. కేర‌ళ‌కు చెందిన ఓ యువ‌కుడు ఇటీవ‌ల‌ యుద్ధంలో మృతి చెంద‌గా, మ‌రొక‌రు గాయ‌ప‌డ్డారు. ఈ ఘటన దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని భారత్ పేర్కొంది. కేర‌ళ యువ‌కుడి మృత‌దేహాన్ని త‌ర‌లించేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నట్టు ఎంబసీ తెలిపింది. భారతీయుల త‌ర‌లింపున‌కు ర‌ష్యా ప్ర‌భుత్వ వ‌ర్గాల‌తో చ‌ర్చిస్తున్న‌ట్టు వెల్లడించింది.