News September 27, 2024

స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటన

image

AP: అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఉపాధ్యాయులు, పలు సంఘాల విజ్ఞప్తితో ఒకరోజు ముందుగానే సెలవులు ఇస్తున్నామని, OCT 13 వరకు సెలవులు ఉంటాయన్నారు. పాఠశాల విద్యపై ఆయన సమీక్షించారు. నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని, 14న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలని సూచించారు.

Similar News

News July 11, 2025

శ్రీశైలం నీళ్లు ఎలా వాడుకుంటారో తెలుసా?

image

శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమ, తెలంగాణకు నీరందుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44వేల క్యూసెక్కులను రాయలసీమకు తరలించొచ్చు. తెలుగు గంగ, గాలేరు-నగరి కాలువల ద్వారా కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు నీరందుతోంది. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకంతో అనంతపురం, చిత్తూరుకు నీరు వెళ్తోంది. అటు తెలంగాణ కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా లబ్ధి పొందుతోంది.

News July 11, 2025

ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

image

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <>ఆధార్ వెబ్‌సైట్‌లో<<>> ఆధార్ నంబర్, క్యాప్చా, OTPతో లాగిన్ అవ్వాలి. LOCK/ UNLOCK ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసి బయోమెట్రిక్స్ తాత్కాలిక/పర్మినెంట్‌ లాక్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. CONSENT బాక్స్‌పై క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ నొక్కితే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. SHARE IT

News July 11, 2025

జగన్ పర్యటన.. మొత్తం నాలుగు కేసులు నమోదు

image

AP: YS జగన్ చిత్తూరు(D) బంగారుపాళ్యం పర్యటనపై తాజాగా మరో కేసు నమోదైంది. అనుమతి లేకున్నా రోడ్‌షో చేపట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి జన సమీకరణ చేపట్టారని, రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు ఉల్లంఘించారని, ఫొటోగ్రాఫర్‌పై జరిగిన దాడి ఘటనపై 3 వేర్వేరు కేసులు పెట్టారు. CC ఫుటేజ్, వీడియోలను పరిశీలిస్తున్న పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.