News March 21, 2024
కాంగ్రెస్ MP అభ్యర్థుల ప్రకటన
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఇందులో 57 మంది పేర్లు ఉండగా తెలంగాణ నుంచి ఐదుగురి పేర్లు ఉన్నాయి. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజిగిరి సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ దానం నాగేందర్, చేవెళ్ల గడ్డం రంజిత్ రెడ్డి, నాగర్కర్నూల్ నుంచి మల్లు రవి పోటీ చేయబోతున్నారు. కాగా, ఇప్పటికే తెలంగాణ నుంచి నలుగురు ఎంపీ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది.
Similar News
News January 8, 2025
రామమందిరంలోకి సీక్రెట్ కెమెరాతో ప్రవేశించిన వ్యక్తి అరెస్ట్
అయోధ్య రామమందిరంలోకి ఓ వ్యక్తి సీక్రెట్ కెమెరాతో ప్రవేశించాడు. కళ్ల జోడుకు ప్రత్యేకంగా అమర్చిన కెమెరాలతో మందిరంలో ఫొటోలు తీసేందుకు ప్రయత్నించాడు. అనుమానాస్పదంగా కనిపించడంతో ఆలయ అధికారులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వడోదరకు చెందిన జైకుమార్గా గుర్తించారు. కాగా మందిరంలో ఫొటోలు, వీడియోలు తీయడం నిషిద్ధం.
News January 8, 2025
చలికాలం మంచి నిద్ర కోసం ఏం తినాలంటే?
చలికాలంలో నిద్రపై మనం రాత్రి తినే ఆహారం ప్రభావం ఉంటుంది. సుఖవంతమైన నిద్ర కోసం మంచి ఆహారం తీసుకుంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు. కివి పండ్లు, చిలకడదుంప, అరటిపండ్లు తీసుకుంటే నిద్రకు ఉపక్రమించే అవకాశాలు మెండుగా ఉంటాయని చెబుతున్నారు. పడుకునే ముందు గోరువెచ్చని పాలు, తేనే తీసుకుంటే నిద్రలేమి సమస్య తగ్గుతుందని అంటున్నారు.
News January 8, 2025
ప్రధానికి కృతజ్ఞతలు: శర్మిష్ట ముఖర్జీ
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి స్మారకచిహ్నం నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించడంపై ఆయన కుమార్తె శర్మిష్ట ముఖర్జీ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి తన కృతజ్ఞతల్ని తెలియజేశానని ఆమె ట్విటర్లో తెలిపారు. ‘నా మనస్ఫూర్తిగా పీఎంకు ధన్యవాదాలు. మేం అడగకపోయినా ప్రభుత్వం ఈ గౌరవం ఇవ్వడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఏ మాత్రం ఊహించలేదు’ అని పేర్కొన్నారు.