News March 21, 2024
కాంగ్రెస్ MP అభ్యర్థుల ప్రకటన
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఇందులో 57 మంది పేర్లు ఉండగా తెలంగాణ నుంచి ఐదుగురి పేర్లు ఉన్నాయి. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజిగిరి సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ దానం నాగేందర్, చేవెళ్ల గడ్డం రంజిత్ రెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవి పోటీ చేయబోతున్నారు. కాగా, ఇప్పటికే తెలంగాణ నుంచి నలుగురు ఎంపీ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది.
Similar News
News September 19, 2024
అశ్విన్ ఫైటింగ్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 339/6 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమైనా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (102) సెంచరీతో చెలరేగారు. రవీంద్ర జడేజా (86) సహకారంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (56) అర్ధ సెంచరీతో రాణించారు. బంగ్లా బౌలర్లలో హసన్ మొహమూద్ 4, రానా, మిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.
News September 19, 2024
కొత్త స్టడీ: రోజూ 3 కప్పుల కాఫీతో లాభాలు
ప్రతిరోజూ మూడు కప్పుల కాఫీ/టీ తాగడం వల్ల గుండె, జీవక్రియ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని తాజా అధ్యయనం సూచిస్తోంది. చైనాలోని సూచౌ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ చౌఫు కే బృందం 1.80 లక్షల మందిపై అధ్యయనం జరిపింది. మితంగా తీసుకొనే కెఫిన్ (3 కప్పుల కాఫీ/టీ) కార్డియోమెటబోలిక్ మల్టీమోర్బిడిటీ, కరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్ నియంత్రణలో సాయపడుతుందని వెల్లడించింది.
News September 19, 2024
INDvBAN: అశ్విన్ సూపర్ సెంచరీ
బంగ్లాదేశ్‌తో తన హోమ్ గ్రౌండ్‌లో జరుగుతున్న టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా ఆడుతున్నారు. కీలక ఆటగాళ్లు ఔటైన టైమ్‌లో 108 బంతుల్లో సెంచరీ చేసి జట్టును ఆదుకున్నారు. ఇది ఆయనకు 6వ సెంచరీ కావడం విశేషం. అశ్విన్‌కు తోడుగా ఉన్న మరో ఆల్‌రౌండర్ జడేజా సైతం సెంచరీని(79) సమీపిస్తున్నారు. వీరిద్దరూ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరి కౌంటర్ ఎటాక్‌కు బంగ్లా బౌలర్ల వద్ద సమాధానం కరవైంది.