News September 8, 2025
రాష్ట్రానికి మరో 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా: అచ్చెన్న

AP: సెప్టెంబర్ నెలకు సంబంధించి కేంద్రం నుంచి మరో 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ‘కాకినాడ పోర్ట్ నుంచి 17,294, మంగళూరు పోర్ట్ నుంచి 5,400, జైగర్ పోర్ట్ నుంచి 10,800, విశాఖ పోర్ట్ నుంచి 15,874 మెట్రిక్ టన్నుల యూరియా 2 రోజుల్లో రాష్ట్రానికి వస్తుంది. వ్యవసాయ అధికారుల సిఫారసు మేరకు మాత్రమే యూరియా వాడాలి. రైతులు ధైర్యంగా ఉండాలి’ అని సూచించారు.
Similar News
News September 10, 2025
ఉపరాష్ట్రపతి ఎన్నికలో క్రాస్ ఓటింగ్?

ఉపరాష్ట్రపతి ఎన్నికలో గెలిచిన NDA అభ్యర్థికి 452 ఓట్లు పోలయ్యాయి. ఎన్డీఏకు 427+11(వైసీపీ) ఎంపీల సపోర్ట్ ఉంది. దీని ప్రకారం NDAకు 438 ఓట్లు పోలవ్వాల్సి ఉండగా 14 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఇవి క్రాస్ ఓటింగ్ ఓట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు ఇండీ కూటమి ఎంపీలు 315మంది ఓట్లేశారని జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. కానీ ఫలితాల్లో వారి అభ్యర్థికి 300 ఓట్లే పడ్డాయి. మరోవైపు 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు.
News September 10, 2025
ఇది కదా విజయం అంటే..!❤️

మన పనులను నిబద్ధతతో చేస్తే గుర్తింపు, అవకాశాలు వాటంతటవే వస్తాయని నిరూపించారు అస్సాంకు చెందిన 27ఏళ్ల సత్యజిత్ బోరా. గ్రామాల్లో జరిగే వాలీబాల్ గేమ్స్‌ను ఈయన మొబైల్ ద్వారా ప్రసారం చేసేవారు. దీంతో సత్యజిత్ అభిరుచిని గుర్తించిన అంతర్జాతీయ వాలీబాల్ సమాఖ్య (FIVB) ప్రపంచ స్థాయి వాలీబాల్ ఈవెంట్ బ్రాడ్ కాస్టింగ్ తీరును దగ్గరుండి చూసేందుకు ఆహ్వానించింది. గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి వెళ్లి సత్తా చాటారు.
News September 10, 2025
నేపాల్‌లో శాంతికి పిలుపునిచ్చిన మోదీ

నేపాల్‌లో యువత ఆందోళనలతో నెలకొన్న హింసాత్మక పరిస్థితులపై ప్రధాని మోదీ X వేదికగా స్పందించారు. ‘నేపాల్‌లో చోటుచేసుకున్న హింస హృదయవిదారకం. ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. అక్కడి పరిస్థితులపై సెక్యూరిటీ క్యాబినెట్ కమిటీ చర్చించింది. నేపాల్‌లో స్థిరత్వం, శాంతి, శ్రేయస్సు మాకు చాలా ముఖ్యం. శాంతికి మద్దతివ్వాలని నేపాలీ సోదర, సోదరీమణులకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఆయన పిలుపునిచ్చారు.