News December 22, 2024

స్మృతి మంధాన మరో ఘనత

image

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మరో అరుదైన ఘనత సాధించారు. ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా ఆమె నిలిచారు. ఈ ఏడాది ఆమె 1,602 పరుగులు చేశారు. ఈ క్రమంలో లారా వాల్వడర్ట్(1,593)ను అధిగమించారు. విండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆమె ఈ ఫీట్ సాధించారు. కాగా ఈ మ్యాచులో స్మృతి (91) కొద్దిలో శతకం చేజార్చుకున్నారు. జేమ్స్ బౌలింగ్‌లో ఆమె వికెట్ల ముందు దొరికిపోయారు.

Similar News

News January 8, 2026

జిల్లా కేంద్రం మార్పుపై జోక్యం చేసుకోలేం: హైకోర్టు

image

AP: అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చే అంశంలో స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమంది. గతంలో ఓ మండలం మార్పులో హైకోర్టు జోక్యం చేసుకోగా సుప్రీంకోర్టు తప్పుపట్టిందని గుర్తుచేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. జిల్లా కేంద్రం మార్పును సవాల్ చేస్తూ ఓ న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు.

News January 8, 2026

శీతాకాలంలో గర్భిణులకు ఈ జాగ్రత్తలు

image

చలికాలంలో దాహం వేయట్లేదని నీరు తక్కువగా తాగుతారు. దీనివల్ల ఉమ్మనీరు తగ్గడంతో పాటు డెలివరీ తర్వాత పాలు కూడా తక్కువగా వస్తాయి. అలాగే గర్భిణులు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి. సి విటమిన్ పుష్కలంగా ఉండే ఉసిరికాయలు, ఇతర పండ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతోపాటు బచ్చలికూర, మెంతి ఆకు, ఉల్లిపాయ ఆకులు వంటి కూరగాయలు కూడా ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News January 8, 2026

అసెంబ్లీకి రాని వైసీపీ MLAలకు నోటీసులు!

image

AP: అసెంబ్లీకి హాజరుకాకుండా జీతాలు తీసుకుంటున్న YCP MLAలపై ఎథిక్స్ కమిటీ కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ అంశంపై సమావేశమైన కమిటీ సభ్యులు సభకు రాకపోయినా జీతాలు, టీఏ, డీఏలు తీసుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముందుగా వారికి నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని నిర్ణయించింది. నిపుణుల అభిప్రాయాలు, ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకుని తదుపరి చర్యలు చేపడతామని కమిటీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ తెలిపారు.