News December 21, 2024

TGలో మరో అగ్రికల్చర్ కాలేజీ.. ఎక్కడంటే?

image

తెలంగాణలో మరో అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సూర్యాపేట (D) హుజూర్ నగర్ మఠంపల్లిలో దీనిని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం 100 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్లు సమాచారం. భూ సేకరణ పూర్తికాగానే ప్రభుత్వం కాలేజీని మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 8 వ్యవసాయ కళాశాలలున్నాయి.

Similar News

News December 21, 2024

$92,281 నుంచి $97,454కు పెరిగిన బిట్‌కాయిన్

image

క్రిప్టో కరెన్సీ మార్కెట్లు గత 24 గంటల్లో కొంతమేర పుంజుకున్నాయి. బిట్‌కాయిన్ $92,281 నుంచి $97,454 (Rs83 లక్షలు) స్థాయికి పెరిగింది. మార్కెట్ డామినెన్స్ 56.95 శాతంగా ఉంది. రెండో అతిపెద్ద కాయిన్ ఎథీరియమ్ 1.48% పెరిగి $3,471 వద్ద ట్రేడవుతోంది. $3098 కనిష్ఠ స్థాయి నుంచి ఎగిసింది. BNB, USDT, DOGE, ADA, AVAX, LLINK, TON, SUI, SHIB లాభపడ్డాయి. XRP, SOL, USDC, TRX, LINK, XLM నష్టపోయాయి.

News December 21, 2024

వైఎస్ జగన్ గారూ.. హ్యాపీ బర్త్ డే: సీఎం చంద్రబాబు

image

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ‘మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు జగన్ గారు. మీకు చక్కటి ఆరోగ్యం, సుదీర్ఘ జీవితం ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. తన రాజకీయ ప్రత్యర్థికి చంద్రబాబు విషెస్ చెప్పడంపై నెట్టింట వైసీపీ, టీడీపీ ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.

News December 21, 2024

పవన్.. గిరిజనులపట్ల మీ నిబద్ధత అద్భుతం: లక్ష్మీనారాయణ

image

AP: డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాల పర్యటనపై జైభారత్ నేషనల్ పార్టీ చీఫ్ లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. ‘గిరిజన ప్రాంతాల అభివృద్ధి పట్ల మీ నిబద్ధత అద్భుతం. గిరిజనులకు నిధుల సమీకరణలో ట్రైబల్ సబ్-ప్లాన్, కేంద్ర ప్రత్యేక సాయం, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పథకాలు కీలకం. మీ నాయకత్వంలో గిరిజనులకు నిధుల కేటాయింపు జరిగి, సంక్షేమ ఫలాలు అందుతాయని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.