News August 18, 2024
ఏపీలో మరో దారుణం

AP: భర్తను చితక్కొట్టి, అతని భార్యపై ముగ్గురు యువకులు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఏలూరులో సంచలనంగా మారింది. జీవనోపాధి కోసం వచ్చి రామకోటిలో ఉంటున్న ఈ జంటకు జులాయిగా తిరిగే ఈ యువకులు పరిచయమయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి మహిళ భర్తతో కలిసి మద్యం సేవించిన ఉన్మాదులు అతడిపై దాడి చేసి, భార్యను కొద్ది దూరం లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Similar News
News February 11, 2025
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక రన్స్ (భారత ప్లేయర్లు)

*సచిన్- 34357 రన్స్ (782 ఇన్నింగ్సులు)
*విరాట్- 27329 (611)
*రాహుల్ ద్రవిడ్- 24208 (605)
*రోహిత్ శర్మ- 19519 (526)
*గంగూలీ- 18575 (488)
*ధోనీ- 17266 (526)
*సెహ్వాగ్- 17253 (443)
*అజహరుద్దీన్- 15593 (455)
News February 11, 2025
అదానీపై అమెరికా కేసులో మరో ట్విస్ట్

అదానీ గ్రూప్‌పై లంచం కేసులో జో బైడెన్ పాలకవర్గంలోని DoJ తీసుకున్న నిర్ణయాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయని ఆరుగురు US కాంగ్రెస్ సభ్యులు కొత్త అటార్నీ జనరల్‌కు లేఖరాశారు. ఇవి మిత్రదేశం భారత్‌తో సంబంధాలను సందిగ్ధంలో పడేశాయన్నారు. రాజకీయాలు, వాణిజ్యం, ఎకానమీస్‌కు అతీతంగా ఎదిగిన 2 దేశాల అనుబంధాన్ని బైడెన్ నిర్ణయాలు రిస్క్‌లో పడేశాయని వెల్లడించారు. కేసును పక్కనపెట్టాల్సింది పోయి ముందుకెళ్లారని ఆరోపించారు.
News February 11, 2025
సైఫ్‌కు ప్లాస్టిక్ కత్తి ఇచ్చిన కొడుకు.. ఎందుకంటే?

స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దుండగుడు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక తన చిన్న కొడుకు జెహ్ చెప్పిన మాటలను ఆయన గుర్తుచేసుకున్నారు. ‘‘పిల్లలు బాగానే ఉన్నారు. దేవుడికి ధన్యవాదాలు. ‘మళ్లీ దొంగ ఇంట్లోకి వస్తాడేమో. ఇది మీ దగ్గర ఉంచుకోండి’ అని జెహ్ ఓ ప్లాస్టిక్ కత్తి ఇచ్చాడు. ‘అబ్బాను గీత కాపాడింది. అబ్బా నన్ను కాపాడాడు’ అని తను చెప్పాడు’’ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.