News June 16, 2024
ఐఏఎస్ శ్రీలక్ష్మికి మళ్లీ చేదు అనుభవం

AP: పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్‌గా ఉన్న శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఆ శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరించిన సమయంలో సంతకం కోసం ఆమె ఫైల్ తీసుకురాగా ఆయన నిరాకరించారు. ఆమెను బదిలీ చేసేవరకు ఫైళ్లు మూవ్ చేయొద్దని, జీఓలపై ఆమె సంతకాలు ఉండరాదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2 రోజుల క్రితం శ్రీలక్ష్మి ఇచ్చిన బొకే తీసుకునేందుకు సీఎం చంద్రబాబు నిరాకరించడం తెలిసిందే.
Similar News
News January 19, 2026
వరి నారుమడిలో ఇలా చేస్తే రైతుకు లాభం

ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల వరి నారుమడిలో నారు ఎర్రగా మారడం, నాటు వేసే సమయం వచ్చినా ఎదుగుదల సరిగా లేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. దీన్ని నివారించాలంటే రోజూ ఉదయమే పొడుగు కర్రను తీసుకొని నారు కొన భాగాలకు తగిలిస్తూ, కొనలపై చేరిన మంచు బిందువులు రాలేలా చేయాలి. దీని వల్ల నారు ఎర్రగా కాకుండా, పెరుగుదల బాగుండటమే కాకుండా కొనల్లో చేరిన పురుగులు కూడా కిందపడి చీడపీడల ఉద్ధృతి తగ్గుతుంది.
News January 19, 2026
ఖమేనీపై దాడి జరిగితే పూర్తి స్థాయి యుద్ధమే: ఇరాన్

తమ ప్రజల కష్టాలకు అమెరికా, దాని మిత్రదేశాలే ప్రధాన కారణమని ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ ఆరోపించారు. అమానవీయ ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. దురాక్రమణకు ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. తమ సుప్రీం లీడర్ ఖమేనీపై దాడి జరిగితే అది ఇరాన్‌పై పూర్తి స్థాయి యుద్ధంతో సమానమని స్పష్టం చేశారు. ఇరాన్‌లో కొత్త నాయకత్వం కోసం సమయం వచ్చిందని ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇలా స్పందించారు.
News January 19, 2026
రాష్ట్రంలో 198 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

TGSRTCలో 198 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ, డిప్లొమా, BE, BTech అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ 84, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు 114 ఉన్నాయి. వయసు 18- 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.tgprb.in * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.


