News November 16, 2024

పాకిస్థాన్‌కు మరో దెబ్బ.. BCCI బాటలోనే కబడ్డీ టీమ్

image

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టును పాకిస్థాన్‌కు పంపేందుకు నిరాకరించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. PAKలో జరిగే ఫ్రెండ్లీ గేమ్స్‌ కోసం భారత కబడ్డీ జట్టును పంపేది లేదని తేల్చింది. దీంతో పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ తగిలినట్లయింది. కాగా భారత ప్రభుత్వ నిర్ణయంతో పాకిస్థాన్ ఆదాయానికి గండి పడినట్లయింది. సెక్యూరిటీ కారణాల వల్లే ఆటగాళ్లను పంపించట్లేదని కేంద్రం అంటోంది.

Similar News

News November 4, 2025

లాటరీలో రూ.60 కోట్లు గెలిచాడు

image

UAEలో నివసించే శరవణన్ వెంకటాచలం అనే ప్రవాస భారతీయుడిని అదృష్టం వరించింది. ‘బిగ్ టికెట్ అబుదాబి 280’ అనే లాటరీ లక్కీ డ్రాలో ఏకంగా 25 మి. దిర్హామ్స్(రూ.60 కోట్లు) గెలుచుకున్నారు. అబుదాబిలో నివసించే ఈయన OCT 30న ‘463221’ నంబరుతో ఉన్న టికెట్ కొనుగోలు చేశారు. నిన్న డ్రా తీయగా శరవణన్‌కు జాక్‌పాట్ తగిలింది. నిర్వాహకులు అతనికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చిందని, ఈమెయిల్‌లో కూడా సంప్రదిస్తామని తెలిపారు.

News November 4, 2025

ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు

image

తూర్పు కోస్ట్ గార్డ్ రీజియన్‌ 14 సివిలియన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, ITI అర్హతగల అభ్యర్థులు DEC 8వరకు అప్లై చేసుకోవచ్చు. స్టోర్ కీపర్, ఇంజిన్ డ్రైవర్, సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్, వెల్డర్ తదితర పోస్టులు ఉన్నాయి. రాత పరీక్ష, ట్రేడ్/ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్:indiancoastguard.gov.in/

News November 4, 2025

మల్లె సాగు – దిగుబడి పెరగాలంటే..

image

మల్లె నాటిన 6 నెలల తర్వాత పూత ప్రారంభమై మొక్క పెరిగే కొద్ది దిగుబడి పెరుగుతుంది. మూడో ఏడాది నుంచి 12-15 సంవత్సరాల వరకు దిగుబడినిస్తుంది. తాజా పువ్వుల కోసం పూర్తిగా అభివృద్ధి చెంది తెరవని మొగ్గలను ఉదయాన్నే 11 గంటల లోపలే కోయాలి. లేకపోతే పువ్వుల నాణ్యత తగ్గిపోతుంది. దిగుబడి పెంచుటకు లీటర్ నీటికి జింక్ సల్ఫేట్ 2.5గ్రా, మెగ్నీషియం సల్ఫేట్ 5గ్రా. సూక్ష్మదాతువులను కలిపి 2,3 దఫాలుగా పిచికారీ చేయాలి.