News November 16, 2024
పాకిస్థాన్‌కు మరో దెబ్బ.. BCCI బాటలోనే కబడ్డీ టీమ్

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టును పాకిస్థాన్‌కు పంపేందుకు నిరాకరించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. PAKలో జరిగే ఫ్రెండ్లీ గేమ్స్ కోసం భారత కబడ్డీ జట్టును పంపేది లేదని తేల్చింది. దీంతో పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ తగిలినట్లయింది. కాగా భారత ప్రభుత్వ నిర్ణయంతో పాకిస్థాన్ ఆదాయానికి గండి పడినట్లయింది. సెక్యూరిటీ కారణాల వల్లే ఆటగాళ్లను పంపించట్లేదని కేంద్రం అంటోంది.
Similar News
News March 9, 2026
ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్?.. మస్క్ రియాక్షన్ ఇదే

సూరత్(గుజరాత్)లో షాకింగ్ ఘటన జరిగింది. ‘ఎలా చనిపోవాలి? ఏ మందులు వాడాలి?’ అని ChatGPTలో అడిగి ఇద్దరు అమ్మాయిలు(18, 20ఏళ్లు) సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఓ వ్యక్తి Xలో పోస్టు చేయగా ఎలాన్ మస్క్ yikes(ప్రమాదకరం, షాకింగ్) అంటూ రిప్లై ఇచ్చారు. అయితే ChatGPT, Gemini Ai సూసైడ్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వట్లేదని పలువురు గుర్తుచేస్తున్నారు.
News March 9, 2026
విజయ్‌కి మరోసారి సీబీఐ నోటీసులు

కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే చీఫ్ విజయ్‌కి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఢిల్లీలోని తమ కార్యాలయంలో రేపు విచారణకు హాజరుకావాలని పేర్కొంది. గతేడాది సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాటలో 41 మంది చనిపోగా 60 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జనవరి 12, 19వ తేదీల్లో సీబీఐ ఆయనను విచారించింది.
News March 9, 2026
‘జీ రామ్ జీ’కి లోగో డిజైన్ చేస్తే ₹50వేలు!

మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన ‘వీబీ జీ రామ్ జీ’ స్కీమ్ లోగో డిజైన్‌పై కేంద్రం పోటీని నిర్వహిస్తోంది. లోగో డిజైనింగ్‌లో విజేతగా నిలిచిన వారికి ₹50వేలు బహుమతిగా ఇవ్వనుంది. ఈ కంటెస్ట్‌లో పాల్గొనాలని అనుకునేవారు <


