News August 9, 2024

కుక్కల దాడిలో మరో బాలుడు మృతి

image

TG: ఇటీవల జవహర్‌నగర్‌లో ఓ బాలుడిని కుక్కలు పీక్కుతిన్న ఘటన మరువకముందే మరో ఘటన జరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామానికి చెందిన శివ-మాధురి దంపతులకు కుమారుడు క్రియాన్ష్(4). ఆ చిన్నారి 20రోజుల క్రితం స్కూల్‌కు వెళ్లి వస్తుండగా కుక్కలు దాడి చేశాయి. దీంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు బాలుడు మృతి చెందాడు.

Similar News

News September 18, 2024

పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్‌గా రికీ పాంటింగ్

image

ఐపీఎల్‌లో వచ్చే సీజన్‌కు తమ కొత్త కోచ్‌గా రికీ పాంటింగ్‌ను పంజాబ్ కింగ్స్ నియమించింది. ఈ మేరకు ట్విటర్‌లో ప్రకటించింది. ‘పంటర్(పాంటింగ్) ఈజ్ పంజాబ్! మా కొత్త హెడ్‌ కోచ్ పదవిలో పాంటింగ్ జాయిన్ అయ్యారు’ అని పేర్కొంది. గడచిన 7 సీజన్లలో ఆ జట్టు ఆరుగురు కోచ్‌లను మార్చడం గమనార్హం. కాగా పాంటింగ్ ఇంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌గా పనిచేశారు.

News September 18, 2024

ఆరుగురు మారినా ఆ జట్టు రాత మారట్లేదు!

image

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు ప్రదర్శనపరంగా, సిబ్బంది ఎంపిక పరంగా అస్థిరతకు మారుపేరుగా నిలుస్తోంది. వచ్చే సీజన్‌కు రికీ పాంటింగ్‌ను నియమించిన ఆ జట్టు గత 7 సీజన్లలో ఆరుగురు కోచ్‌లను మార్చింది. ఆ టీమ్ ప్రదర్శన చూస్తే.. ఐపీఎల్ చరిత్రలో కేవలం 2సార్లు మాత్రమే ప్లేఆఫ్స్‌కు వెళ్లింది. గత పదేళ్లలో అయితే ఒక్కసారీ ప్లేఆఫ్ గడప తొక్కలేదు. ఈ ఏడాది 9వ స్థానంలో నిలిచింది.

News September 18, 2024

రిటైర్మెంట్ అంటే జోక్‌గా మారింది: రోహిత్

image

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో రిటైర్మెంట్ అంటే జోక్‌గా మారిందని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. కొందరు ఆటకు వీడ్కోలు పలికి తిరిగి ఆడుతున్నారని చెప్పారు. అయితే భారత జట్టులో అలాంటిదేమీ లేదన్నారు. తన రిటైర్మెంట్ విషయంలో మాత్రం క్లారిటీగా ఉన్నానని తెలిపారు. T20Iలకు గుడ్ బై చెప్పిన విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు.