News September 29, 2024

ఆఫీసులో ఆగిన మరో గుండె.. టెకీ దుర్మరణం

image

పని ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో కార్పొరేట్ ఆఫీసుల్లోనే ఉద్యోగులు మరణిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని HCL కార్యాలయం వాష్‌రూమ్‌లో టెకీ నితిన్ ఎడ్విన్(40) కుప్పకూలారు. సహచరులు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల లక్నోలోని HDFC బ్యాంక్‌ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ సదాఫ్ ఫాతిమా, పుణేలో CA సెబాస్టియన్ పెరయిల్ ఇలాగే కన్నుమూశారు.

Similar News

News October 19, 2025

అభ్యర్థులే CHSLE సెంటర్ ఎంచుకునే అవకాశం

image

కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామ్(CHSLE -2025) టైర్ 1 పరీక్ష నవంబర్ 12న ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అనుకూలమైన సిటీ, షిఫ్ట్‌ను ఎంచుకునే సౌకర్యంను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) కల్పించింది. అభ్యర్థులు SSC పోర్టల్‌లో లాగిన్ అయి నగరం (దరఖాస్తు సమయంలో ఎంచుకున్న మూడు నగరాల్లో ఒకటి), తేదీ, షిఫ్ట్‌ను ఎంచుకోవచ్చు. పోర్టల్ విండో అక్టోబర్ 22 నుంచి 28 వరకు ఓపెన్ అవుతుంది.

News October 19, 2025

మ్యాచ్ రీస్టార్ట్.. 26 ఓవర్లకు కుదింపు

image

భారత్, ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌‌కు వర్షం అంతరాయం కారణంగా అంపైర్లు ఓవర్లను 26కు కుదించారు. వర్షం కాస్త తెరిపినివ్వడంతో మ్యాచ్ రీస్టార్ట్ అయింది. 18 ఓవర్లలో భారత్ 4 వికెట్లు కోల్పోయి 65 రన్స్ చేసింది. మరో 8 ఓవర్లు మాత్రమే మిగిలున్నాయి. అక్షర్(25*), రాహుల్ (5*) క్రీజులో ఉన్నారు. 26 ఓవర్లలో కనీసం 130 రన్స్ టార్గెట్ నిర్దేశిస్తేనే భారత్‌ పోరాడేందుకు అవకాశం ఉండనుంది.

News October 19, 2025

దూడలలో తెల్లపారుడు వ్యాధి లక్షణాలు

image

గేదె, సంకర జాతి దూడల్లో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వ్యాధి సోకిన దూడలు తెల్లగా పారతాయి. దీని నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధికి గురైన దూడల శరీరం నుంచి నీరు కోల్పోయి కళ్లగుంటలు బాగా లోపలికి పోయి ఉంటాయి. చర్మము ముడతలు పడి ఉంటుంది. చివరకు వ్యాధి తీవ్రంగా మారితే దూడ ఎక్కువగా పారి నీరసించి చనిపోతుంది. అందుకే ఈ వ్యాధి లక్షణాలను గుర్తించిన వెంటనే వెటర్నరీ వైద్యునికి చూపించాలి.