News September 29, 2024
ఆఫీసులో ఆగిన మరో గుండె.. టెకీ దుర్మరణం

పని ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో కార్పొరేట్ ఆఫీసుల్లోనే ఉద్యోగులు మరణిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని HCL కార్యాలయం వాష్‌రూమ్‌లో టెకీ నితిన్ ఎడ్విన్(40) కుప్పకూలారు. సహచరులు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల లక్నోలోని HDFC బ్యాంక్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ సదాఫ్ ఫాతిమా, పుణేలో CA సెబాస్టియన్ పెరయిల్ ఇలాగే కన్నుమూశారు.
Similar News
News July 6, 2025
ఈనెల 10న జిల్లాలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్: కలెక్టర్

ఈనెల 10న జిల్లాలో పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే పేరెంట్స్ టీచర్స్ మీట్ నిర్వహించడం జరిగిందని, ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో కూడా పీటీఎం సమావేశాలు నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
News July 6, 2025
నేటి ముఖ్యాంశాలు

* పిల్లలు, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం: రేవంత్
* ఈనెల 12 నుంచి వడ్డీ లేని రుణాల పంపిణీ: భట్టి
* ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
* చర్చకు ప్రిపేరయ్యేందుకు 72 గంటల సమయం: కేటీఆర్
* మహిళలకు 5వేల ఈవీ ఆటోలు: మంత్రి పొన్నం
* AP: వచ్చే జూన్ నాటికి వెలిగొండ పూర్తి చేయాలి: సీఎం
* వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు
* 20,494 ఎకరాల భూ సమీకరణకు CRDA ఆమోదం: మంత్రి
News July 6, 2025
టెస్టు చరిత్రలో తొలిసారి

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓ టెస్టులో తొలిసారిగా 1000+ రన్స్ నమోదు చేసింది. తొలి ఇన్నింగ్సులో 587 చేసిన గిల్ సేన రెండో ఇన్నింగ్సులో 427 పరుగులు చేసింది. ఇప్పటివరకు 2004లో ఆస్ట్రేలియాపై చేసిన 916 పరుగులే భారత జట్టుకు అత్యధికం. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో గిల్ ద్విశతకం, శతకం బాదగా ఇతర ప్లేయర్లు ఒక్క సెంచరీ చేయకపోవడం గమనార్హం.