News October 26, 2024

నందిగం సురేశ్‌పై మరో కేసు

image

AP: బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌పై మరో కేసు నమోదైంది. గతంలో అమరావతి ఉద్యమానికి మద్దతిచ్చేందుకు రైతుల శిబిరాలకు వచ్చిన ప్రస్తుత మంత్రి సత్యకుమార్‌పై నందిగం సురేశ్, అతని అనుచరులు దాడి చేశారని ఓ BJP నేత ఫిర్యాదు చేశారు. ఆ దాడిలో సురేశ్ స్వయంగా పాల్గొన్నారని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే TDP ఆఫీసుపై దాడి, ఓ మహిళ హత్య కేసులు ఆయనపై నమోదయ్యాయి.

Similar News

News October 26, 2024

బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా DSC కోచింగ్: మంత్రి

image

AP: డీఎస్సీ అభ్యర్థుల కోసం 26 జిల్లా కేంద్రాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి ఎస్.సవిత తెలిపారు. అన్ని ప్రవేశ పరీక్షలకు బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా శిక్షణ ఇస్తామని చెప్పారు. కేంద్ర పథకాలను వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బీసీ హాస్టళ్లలో డైట్ బిల్లు బకాయిలను త్వరలో చెల్లిస్తామన్నారు. సీడ్ పథకంతో సంచార జాతులకు మేలు కలుగుతుందని పేర్కొన్నారు.

News October 26, 2024

టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీల విడుదల

image

AP: టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల ఫీజులను ఈ నెల 28 నుంచి నవంబర్ 11లోపు చెల్లించాలని ప్రభుత్వం పరీక్షల విభాగం ప్రకటించింది. రెగ్యులర్ విద్యార్థులు ప్రధానోపాధ్యాయుల ద్వారా రూ.125 ఫీజు చెల్లించాలని తెలిపింది. నవంబర్ 12 నుంచి 18లోపు చెల్లిస్తే రూ.50, 19 నుంచి 25 వరకు రూ.200, 26 నుంచి నెలాఖరు వరకు అయితే అదనంగా రూ.500 ఫైన్‌తో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

News October 26, 2024

UNSC: పాక్‌ను మళ్లీ ఉతికారేసిన భారత్

image

UNSCలో పాక్‌ను భారత్ మరోసారి ఉతికారేసింది. కీలక డిబేట్‌లో కశ్మీర్లో మహిళల అంశాన్ని లేవనెత్తడంపై సీరియస్ అయింది. ఇది వారి అబద్ధాల వ్యాప్తి వ్యూహం ఆధారంగా చేపట్టిన రెచ్చగొట్టే చర్యగా వర్ణించింది. ‘పాక్ సంబంధం లేని పొలిటికల్ ప్రాపగండాకు దిగింది. మీ దేశంలో హిందువులు, సిక్కులు, క్రైస్తవులు సహా మైనారిటీ మహిళల దుస్థితేంటో అందరికీ తెలుసు’ అని UNలో పర్మనెంట్ రిప్రజెంటేటివ్ పర్వతనేని హరీశ్ అన్నారు.