News March 18, 2025

విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు

image

AP: కాకినాడ పోర్టు షేర్ల బదలాయింపు వ్యవహారంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సీఐడీ రెండోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 25న విచారణకు రావాలని అందులో పేర్కొంది. కాగా ఈ నెల 12న ఆయన తొలిసారి విచారణకు హాజరయ్యారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Similar News

News April 25, 2025

‘పహల్గామ్’ మృతుల కుటుంబాలకు జగన్ పరామర్శ

image

AP: పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్, చంద్రమౌళి కుటుంబాలను మాజీ సీఎం జగన్ ఫోన్‌లో పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జరిగిన ఘటన దురదృష్టకరమని అన్నారు. పార్టీపరంగా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

News April 25, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 25, 2025

పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

image

ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఆ దేశంపై భారత ఉమెన్స్ బేస్‌బాల్ టీమ్ అదరగొట్టింది. ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో 2-1 తేడాతో ఘన విజయం సాధించింది.

error: Content is protected !!