News January 7, 2025
ఇంటర్ విద్యార్థులకు మరో ఛాన్స్

TG: ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. గత నెల 31తోనే గడువు ముగియగా రూ.2,500 అపరాధ రుసుముతో ఈ నెల 16వ తేదీ వరకు ఛాన్స్ ఇచ్చింది. వివిధ కారణాలతో ఇప్పటి వరకు ఫీజు చెల్లించని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్, మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
Similar News
News December 10, 2025
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీలో ఉద్యోగాలు

<
News December 10, 2025
నానో ఎరువులను ఎలా వాడాలి?

నానో యూరియా, DAPలను పైరుపై పిచికారీ పద్ధతిలోనే వాడాలి. వీటిని భూమిలో, డ్రిప్లలో వాడకూడదు. పంటలకు దుక్కిలో వ్యవసాయ నిపుణులు సిఫార్సు చేసిన ఎరువులను యథావిధిగా వేయాలి. పంటకు పైన ఎరువులను సిఫార్సు చేసినప్పుడు మాత్రం.. నానో ఎరువుల రూపంలో పిచికారీ చేసుకోవాలి. నానో యూరియా, DAPలను ఎకరాకు అర లీటరు(లీటరు నీటికి 4ml)చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత సంప్రదాయ యూరియా, DAPలను పంటకు వేయనవసరం లేదు.
News December 10, 2025
ఇతిహాసాలు క్విజ్ – 92

ఈరోజు ప్రశ్న: గణపతి, కార్తీకేయ సోదరులను ముల్లోకాలు చుట్టిరమ్మనే పరీక్ష శివుడు ఎందుకు పెట్టాడు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


