News January 7, 2025

ఇంటర్ విద్యార్థులకు మరో ఛాన్స్

image

TG: ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. గత నెల 31తోనే గడువు ముగియగా రూ.2,500 అపరాధ రుసుముతో ఈ నెల 16వ తేదీ వరకు ఛాన్స్ ఇచ్చింది. వివిధ కారణాలతో ఇప్పటి వరకు ఫీజు చెల్లించని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్, మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Similar News

News January 17, 2025

ఆడలేక మద్దెల దరువన్నట్లుగా చంద్రబాబు తీరు: షర్మిల

image

AP: ‘ఏరుదాటేదాక ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న’ తీరుగా CBN వ్యవహారం ఉందని APCC చీఫ్ షర్మిల మండిపడ్డారు. సూపర్ సిక్స్ అంటూ ఆర్భాటం చేసి ఇప్పుడు ఆదాయం పెరగాలంటున్నారని దుయ్యబట్టారు. హామీలు ఇచ్చే ముందు రాష్ట్రానికి రూ.10లక్షల కోట్ల అప్పులున్నాయని తెలియదా? అని ప్రశ్నించారు. ఆడలేక మద్దెల దరువన్నట్లుగా చంద్రబాబు తీరు ఉందన్నారు. ఏపీకి ఏమాత్రం సహకరించని మోదీతో పొత్తు ఎందుకని Xలో నిలదీశారు.

News January 17, 2025

రక్తం కారుతున్నా సైఫ్ సింహంలా వచ్చారు: వైద్యులు

image

దుండగుడి దాడిలో సైఫ్ అలీఖాన్‌కు తీవ్ర రక్తస్రావమైనా స్ట్రెచర్ ఉపయోగించలేదని ముంబైలోని లీలావతి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కుమారుడితో కలిసి ఆస్పత్రికి వచ్చే సమయంలో రక్తం వస్తున్నా ‘ఒక సింహంలా, రియల్ హీరోలా’ నడుచుకుంటూ వచ్చారని చెప్పారు. వెన్నెముకలో కత్తి మరో 2 MM లోపలికి దిగి ఉంటే సీరియస్ ఇంజురీ అయి ఉండేదని పేర్కొన్నారు. ప్రస్తుతం అతడికి పక్షవాతం వచ్చే అవకాశం లేదని, క్షేమంగా ఉన్నారని వివరించారు.

News January 17, 2025

సైఫ్ ఇంట్లో సెక్యూరిటీ, సీసీ కెమెరాలు లేవు: పోలీసులు

image

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ఇంట్లో CCTV కెమెరాలు లేకపోవడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని ముంబై పోలీసులు వెల్లడించారు. విజిటర్స్‌ను చెక్ చేసేందుకు, ఎమర్జెన్సీ సమయంలో వెంటనే స్పందించేందుకు వారి ఫ్లాట్ ముందు పర్సనల్ గార్డ్స్ కూడా లేరని తెలిపారు. ఆ బిల్డింగ్‌కు వచ్చే వారి వివరాలు నమోదు చేసేందుకు లాగ్ బుక్ కూడా లేదని చెప్పారు. సెలబ్రిటీలు సెక్యూరిటీ పెట్టుకోకపోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.