News August 30, 2024
భారత్లో మరోసారి కొవిడ్ విజృంభణకు ఛాన్స్: నిపుణులు

కొవిడ్ మరోసారి పంజా విసరడానికి సిద్ధంగా ఉందని అమెరికా CDC(సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్) నిపుణులు అంచనా వేశారు. ఒమిక్రాన్ రకంలోని KP వేరియంట్స్ వల్ల ఇండియాతోపాటు US, సౌత్ కొరియాలో కేసులు పెరగొచ్చని, దీనికి సిద్ధంగా ఉండాలని సూచించారు. జూన్ 24-జులై 21 మధ్య ప్రతివారం 85 దేశాల్లో సగటున 17,358 నమూనాలను పరీక్షించి ఈ వివరాలు వెల్లడించారు. ఇండియాలో కొత్తగా 908 కేసులతోపాటు 2 మరణాలు నమోదయ్యాయని తెలిపారు.
Similar News
News December 10, 2025
వనపర్తి: ‘మూడు నెలల జీతాలు పెండింగ్’

3నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని డేటా ఎంట్రీ ఆపరేటర్లు DM&HO డా.సాయినాథ్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. జీవో 1195 ప్రకారం ప్రతి ఉద్యోగికి రూ.19,500 చెల్లించాలని, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 11 నుంచి 19ఆన్లైన్ వర్క్ బంద్ చేస్తున్నట్లు, 19లోపు వేతనాలు ఇవ్వని పక్షంలో 20 నుంచి నిరవధిక సమ్మే చేస్తామన్నారు.
News December 10, 2025
గర్భంలోని బిడ్డకు HIV రాకూడదంటే..

హెచ్ఐవీ ఉన్న మహిళ గర్భం దాలిస్తే మాయ ద్వారా, రక్తం ద్వారా బిడ్డకి వైరస్ సంక్రమించే అవకాశం ఉంటుంది. ఇలాకాకుండా ఉండాలంటే వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలి. కాన్పు సమయంలో తల్లి నుంచి బిడ్డకి యోని ద్వారా వైరస్ సంక్రమించే అవకాశాలుంటాయి. కాబట్టి సీ సెక్షన్ చేయించడం మంచిది. పుట్టిన తర్వాత బిడ్డకు కూడా పరీక్ష చేయించి, ఆరు వారాల వరకు హెచ్ఐవీ మందులు వాడటం వల్ల వైరస్ బిడ్డకు సోకి ఉంటే నాశనమవుతుంది.
News December 10, 2025
ఇతిహాసాలు క్విజ్ – 92 సమాధానం

ఈరోజు ప్రశ్న: గణపతి, కార్తీకేయ సోదరులను ముల్లోకాలు చుట్టిరమ్మనే పరీక్ష శివుడు ఎందుకు పెట్టాడు?
సమాధానం: ప్రమథగణాలకు నాయకత్వం వహించడానికి అర్హులెవరో నిర్ణయించడానికి శివుడు ఈ పరీక్ష పెట్టాడు. కార్తికేయుడు లోకాలు చుట్టడానికి వెళ్లగా, గణపతి శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేసి తల్లిదండ్రులే సకల లోకాలు అని నిరూపించాడు. అలా వినాయకుడు సకల కార్యాలలో తొలి పూజలు అందుకునే వరాన్ని అనుగ్రహించాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>


