News September 26, 2024
యూట్యూబర్ హర్షసాయిపై మరో ఫిర్యాదు
TG: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్షసాయిపై బాధితురాలు మరో ఫిర్యాదు చేశారు. హర్షసాయి తనకు ఈ-మెయిళ్లు పంపిస్తూ వేధిస్తున్నాడని హైదరాబాద్ నార్సింగి పీఎస్‌లో కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పటికే తనపై అత్యాచారం చేశాడని, రూ.2 కోట్ల డబ్బులు కూడా తీసుకున్నాడని హర్షపై ఇదే పీఎస్‌లో ఆమె కేసు పెట్టిన సంగతి తెలిసిందే.
Similar News
News October 11, 2024
నీటి పారుదల శాఖకు రూ.284 కోట్లు విడుదల
AP: జలవనరుల ప్రాజెక్టుల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన పనుల కోసం నీటిపారుదల శాఖకు రూ.284.04 కోట్లు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నుంచి ఈ నిధులు విడుదల చేసింది. దీంతో కాలువలు, ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు వంటివి చేయనున్నారు. అంతకుముందు రూ.310 కోట్లతో ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ అంచనా వ్యయాన్ని పంపింది.
News October 11, 2024
GOOD NEWS.. వారికి బోనస్
కేంద్ర ప్రభుత్వంలోని గ్రూప్-C ఉద్యోగులు, గ్రూప్-బి నాన్‌గెజిటెడ్ ఉద్యోగులకు నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్‌ను ప్రభుత్వం ప్రకటించింది. 2024 మార్చి 31లోపు ఉద్యోగంలో చేరిన, 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 6 నెలలు విధులు నిర్వహించిన వారు బోనస్‌కు అర్హులు. పనిచేసిన రోజులను బట్టి చెల్లింపులు ఉంటాయి. అర్హులైన ఉద్యోగులకు యావరేజ్‌గా రూ.6908 బోనస్ అందుతుంది. కేంద్ర పారామిలిటరీ, ఆర్మీ ఉద్యోగులూ అర్హులే.
News October 11, 2024
9 రోజుల్లో రూ.713 కోట్ల మద్యం తాగేశారు
TG: దసరా పండుగకు ముందు వరుస సెలవుల నేపథ్యంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. గత 9 రోజుల్లో రూ.713.25 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. రేపు దసరా కావడంతో ఈ మూడు రోజుల్లో సేల్స్ ఎక్కువగా జరుగుతాయని అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే రూ.350 కోట్ల అమ్మకాలు అదనంగా ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఈ సారి బీర్ల కంటే లిక్కర్ అమ్మకాలే ఎక్కువ జరుగుతున్నట్లు పేర్కొన్నారు.