News April 10, 2025
ధనుష్-శేఖర్ కమ్ముల కాంబోలో మరో చిత్రం?

శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ధనుష్ నటిస్తోన్న ‘కుబేర’ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. జూన్ 20న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగానే శేఖర్ కమ్ముల మరో కథను వినిపించగా ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. కాగా కుబేరలో రష్మిక, నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Similar News
News April 18, 2025
గద్వాల: ‘’జై భీమ్’ అని 1,46,385 సార్లు రాస్తే రూ.5016 బహుమతి?’

జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలో అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని వినూత్న కార్యక్రమం చేపట్టారు. భారత రాజ్యాంగంలో 1,46,385 పదాలు ఉన్నాయని, అందుకు అనుగుణంగా 1,46,385 సార్లు జై భీమ్.. జై భీమ్.. అని రాస్తే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ఎవరైతే మంచి చేతి రాతతోని రాస్తారో వారికి రూ.5,016 బహుమతిగా ఇస్తానని కాంగ్రెస్ పార్టీ రాజోలి మండలాధ్యక్షుడు పులిపాటి దస్తగిరి ఒక ప్రకటనలో అన్నారు.
News April 18, 2025
ఏప్రిల్ 18: చరిత్రలో ఈరోజు

1809: కవి, పండితుడు హెన్రీ డెరోజియా జననం
1880: రచయిత టేకుమళ్ల అచ్యుతరావు జననం
1958: విండీస్ మాజీ క్రికెటర్ మాల్కం మార్షల్ జననం
1859: స్వాతంత్ర్యసమరయోధుడు తాంతియా తోపే మరణం
1955: శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్(ఫొటోలో) మరణం
* ప్రపంచ వారసత్వ దినోత్సవం (అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం)
News April 18, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.