News March 6, 2025
సౌతాఫ్రికాకు మరోసారి హార్ట్ బ్రేక్

ICC మెగా టోర్నీల్లో దక్షిణాఫ్రికాకు మరోసారి గుండెకోత తప్పలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై ఆ జట్టు ఓడిపోయి ఇంటిబాట పట్టింది. ఇప్పటివరకు ఆ జట్టు 10 సార్లు ICC సెమీ ఫైనళ్లు ఆడింది. ఇందులో 9 మ్యాచుల్లో ఓడి ఫైనల్‌కు దూరమైంది. గత T20 వరల్డ్ కప్ సెమీస్‌లో మాత్రమే ఆ జట్టు గెలిచి ఫైనల్‌కు చేరింది. ఆ ఆనందం కూడా ప్రొటీస్‌కు ఎక్కువసేపు నిలవలేదు. ఫైనల్ పోరులో టీమ్ ఇండియా చేతిలో ఓడింది.
Similar News
News March 15, 2025
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకున్నాం: మంత్రి ఉత్తమ్

TG: ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి (RLIP) కేంద్రం పర్యావరణ అనుమతులు నిరాకరించిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఇది తమ సర్కారు సాధించిన విజయమని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం అంతర్రాష్ట్ర నిబంధనలను ఉల్లంఘించి RLIP నిర్మాణం చేపట్టిందని కేంద్రం వద్ద తాను వాదనలు వినిపించానని చెప్పారు. దీన్ని అడ్డుకోకుండా ఉండి ఉంటే కృష్ణా పరివాహకంలో దుర్భర పరిస్థితి ఏర్పడేదన్నారు.
News March 15, 2025
నటి రన్యా రావు తండ్రిపై ప్రభుత్వం చర్యలు!

బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరులో పట్టుబడిన కన్నడ నటి రన్యా రావు కేసులో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆమె సవతి తండ్రి, హౌసింగ్ కార్పొరేషన్ DGP రామచంద్రారావును సెలవుల్లో పంపింది. ఆయన స్థానంలో కె.వి.శరత్ చంద్రను నియమించింది. మరోవైపు రన్యారావు బెయిల్ పిటిషన్‌ను ఈడీ న్యాయస్థానం తిరస్కరించింది. ఈ సందర్భంగా తనను కొట్టి తెల్ల కాగితాలపై పోలీసులు సంతకాలు చేయించుకున్నారని రన్యా రావు ఆరోపించారు.
News March 15, 2025
మళ్లీ నేనే సీఎం: రేవంత్ రెడ్డి

TG: రెండోసారి కూడా తానే సీఎం అవుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు. ‘తొలిసారి BRSపై వ్యతిరేకతతో మాకు ఓటు వేశారు. రెండోసారి మాపై ప్రేమతో వేస్తారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే మా ఓటర్లు. నా పనిని నమ్ముకుని ముందుకు వెళ్తున్నా. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం’ అని తెలిపారు.