News December 11, 2024

రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

image

TG: రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’, తెలంగాణ తల్లి ఫొటోను పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది ఒకటో తరగతి నుంచి పదో తరగతి టెక్ట్స్ బుక్‌ల్లో ఇవి కనిపించనున్నాయి. ప్రస్తుత పుస్తకాల్లో ప్రతిజ్ఞతోపాటు జాతీయ గీతం, జాతీయ గేయం ఉన్నాయి. ఇక వచ్చే ఏడాదీ విద్యార్థులకు పాత సిలబస్సే ఉంటుందని, 2026-27లో సిలబస్ మారే అవకాశం ఉందని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి తెలిపారు.

Similar News

News February 7, 2026

‘వాట్సాప్ మీ సేవ’లో 581 సేవలు

image

TG: ‘వాట్సాప్ మీ సేవ’లో ఇప్పటివరకు 4.5L మంది తమ వివరాలు నమోదు చేసుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది. వారిలో 3.25L మంది డిజిటల్ సేవలు అందుకున్నారని తెలిపింది. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా 8096958096 అనే వాట్సాప్ నంబర్‌కు HI అని మెసేజ్ చేసి 581 రకాల సేవలు పొందవచ్చని పేర్కొంది. బర్త్, డెత్, ఇన్‌కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్లు, లైసెన్సులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు తదితరాలను పొందవచ్చంది.

News February 7, 2026

సాగు భూములకే రైతు భరోసా!

image

TG: రైతు భరోసా(₹6,000) కేవలం సాగులో ఉన్న భూములకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వానాకాలం సీజన్‌లో సాగు వివరాల ఆధారంగా అర్హులైన రైతులకే నగదు జమ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అగ్రికల్చర్ వర్సిటీ శాటిలైట్ మ్యాపింగ్ సర్వే పూర్తి చేయగా 1.53 కోట్ల ఎకరాల సాగుభూమిలో 20 లక్షల ఎకరాలు పంట వేయకుండా ఉన్నట్లు తేలింది. కాగా మున్సిపోల్ తర్వాత రైతు భరోసా ఇస్తామని CM ప్రకటించారు.

News February 7, 2026

రేపు సూర్యుడిని ఎందుకు పూజించాలి?

image

రేపు భాను సప్తమి. దీన్నే ‘ఆరోగ్య సప్తమి’ అని కూడా అంటారు. ఈ రోజున సూర్యోదయానికి ముందే పవిత్ర నదులలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు తొలగిపోయి, శరీరం శుద్ధి అవుతుందని నమ్ముతారు. సూర్యరశ్మిలోని శక్తి మన శారీరక, మానసిక అనారోగ్యాలను నయం చేస్తుంది. నిష్ఠతో ఉపవాసం ఉండి సూర్యుడిని పూజించే వారికి గత జన్మల పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా, ఏడాది పొడవునా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేలా దైవిక రక్షణ లభిస్తుంది.