News September 17, 2024

ఢిల్లీలో మరో అంతర్జాతీయ స్టేడియం

image

ఢిల్లీలో కొత్తగా ద్వారక అంతర్జాతీయ స్టేడియం నిర్మించనున్నారు. దీనిని క్రికెట్ కమ్ ఫుట్‌బాల్ స్టేడియంగా DDA (ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ) రూపొందించనుంది. రూ.1,500 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ స్టేడియంలో స్విమ్మింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, టీటీ వంటి ఆటలు ఆడేందుకు సౌకర్యాలు ఉంటాయి. 30 వేల మంది కెపాసిటీతో దీనిని నిర్మిస్తారు. ఈ ఏడాది చివర్లో పనులు ప్రారంభించి 2027 సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తారు.

Similar News

News January 22, 2026

100% హోమ్ లోన్.. RBI రూల్ ఏంటి?

image

డౌన్ పేమెంట్ లేకుండా బ్యాంక్ లోన్‌‌తో ఇల్లు కొనుగోలు చేయొచ్చని ప్రసారమయ్యే యాడ్స్‌లో నిజం లేదు. RBI నిబంధనల ప్రకారం బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ప్రాపర్టీ విలువలో 100%కి లోన్ ఇవ్వవు. పర్సనల్ సేవింగ్స్ నుంచి కొనుగోలుదారుడు కొంత మొత్తాన్ని తప్పకుండా చెల్లించాలి. రూ.30లక్షల వరకు ఉన్న ప్రాపర్టీకి 90%, రూ.30లక్షల-75లక్షల వరకు 80%, రూ.75లక్షల కంటే ఎక్కువైతే 75% వరకు మాత్రమే లోన్ మంజూరు చేయొచ్చు.

News January 22, 2026

మహాశివరాత్రి ఏరోజు జరుపుకోవాలి?

image

మహా శివరాత్రి ఏటా మాఘ మాసంలోని కృష్ణ పక్షం చతుర్దశి రోజున వస్తుంది. సాధారణంగా హిందూ పండుగలు ఉదయం పూట తిథి ఉన్న రోజున జరుపుకుంటారు. కానీ శివరాత్రికి మాత్రం రాత్రి సమయంలో తిథి ఉండటం ప్రధానం. ఈ ఏడాది చతుర్దశి తిథి ఫిబ్రవరి 15 (ఆదివారం) సా.4.47కి ప్రారంభమై 16న (సోమవారం) సా.5.32కి ముగియనుంది. అర్ధరాత్రి చతుర్దశి ఉన్న 15వ తేదీన మహాశివరాత్రి జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.

News January 22, 2026

మీరు మా వల్లే బతుకుతున్నారు.. కెనడా PMపై ట్రంప్ ఫైర్

image

దావోస్ వేదికగా కెనడాపై ట్రంప్ ఫైర్ అయ్యారు. ‘US వల్లే కెనడా బతుకుతోంది. మా నుంచి చాలా లబ్ధి పొందుతున్నారు. మీకు కృతజ్ఞత లేదు. మార్క్ ఇంకోసారి మాట్లాడేటప్పుడు ఇది గుర్తుంచుకో’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా లాంటి పెద్ద దేశాలు తమ ఆర్థిక శక్తిని వాడుకుని ఇతర కంట్రీస్‌ను భయపెడుతున్నాయని, అందుకే మధ్యస్థ దేశాలన్నీ ఏకం కావాలని కెనడా PM మార్క్ కార్నీ అన్న వ్యాఖ్యలకు కౌంటర్‌గా ట్రంప్ సీరియస్ అయ్యారు.