News September 17, 2024
ఢిల్లీలో మరో అంతర్జాతీయ స్టేడియం
ఢిల్లీలో కొత్తగా ద్వారక అంతర్జాతీయ స్టేడియం నిర్మించనున్నారు. దీనిని క్రికెట్ కమ్ ఫుట్‌బాల్ స్టేడియంగా DDA (ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ) రూపొందించనుంది. రూ.1,500 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ స్టేడియంలో స్విమ్మింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, టీటీ వంటి ఆటలు ఆడేందుకు సౌకర్యాలు ఉంటాయి. 30 వేల మంది కెపాసిటీతో దీనిని నిర్మిస్తారు. ఈ ఏడాది చివర్లో పనులు ప్రారంభించి 2027 సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తారు.
Similar News
News October 3, 2024
పవన్‌ను చూస్తుంటే ‘కెవ్వు కేక’ సాంగ్ గుర్తొస్తుంది: భూమన
AP: వైసీపీ చీఫ్ జగన్ మీద ఇష్టం వచ్చినట్లుగా డిప్యూటీ సీఎం పవన్ రాజకీయ ప్రేలాపనలు చేస్తున్నారని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ దుయ్యబట్టారు. సనాతన ధర్మాన్ని ఆయన రక్షిస్తున్నట్లుగా పవన స్వాముల మాటలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. సనాతన ధర్మం గురించి మాట్లాడటం వెనుక వేరే అజెండా ఉందన్నారు. పవన్ స్వామిని చూస్తుంటే ‘కెవ్వు కేక’ సాంగ్ గుర్తొస్తుందన్నారు. ఆయన పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు.
News October 3, 2024
ప్రజా ప్రతినిధులు హుందాతనాన్ని కాపాడుకోవాలి: రాజమౌళి
అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలను దర్శకధీరుడు రాజమౌళి ఖండించారు. నిరాధారమైన ఆరోపణలను సహించేది లేదన్నారు. మరీ ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు హద్దులను గౌరవిస్తూ, హుందాతనాన్ని కాపాడుకోవాలని ట్వీట్ చేశారు. ఇప్పటికే చిరంజీవి, ఎన్టీఆర్, మహేశ్ బాబు, నాని వంటి స్టార్లు సురేఖ వ్యాఖ్యలను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.
News October 3, 2024
అంబానీ ఇంటికి రూ.వెయ్యి కోట్ల విమానం
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ దాదాపు రూ.వెయ్యికోట్లు ఖర్చు చేసి కొన్న బోయింగ్ 737 MAX 9 ఇండియాకు వచ్చింది. ఇది మన దేశంలోనే అత్యంత ఖరీదైన విమానమని తెలుస్తోంది. ఆయన దగ్గర ఇప్పటికే తొమ్మిది ప్రైవేట్ జెట్‌లు ఉన్నాయి. ఇటీవల ఆయన కొన్న ఈ బోయింగ్ ఫ్లైట్ విదేశాల్లో టెస్టు తర్వాత తాజాగా ఇండియాకు చేరుకుంది. ఈ విమానం 838kmph వేగంతో నాన్ స్టాప్‌గా 11,770kmలు ప్రయాణిస్తుంది.