News August 5, 2024
మరో మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్

ఈ ఏడాది జనవరిలో తొలిసారి ఓ మనిషి(<<12569229>>అర్బాగ్<<>>) మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ ప్రవేశపెట్టిన న్యూరాలింక్ తాజాగా మరో వ్యక్తిలోనూ చిప్ అమర్చినట్లు తెలిపింది. అతని మెదడులోని 400 ఎలక్ట్రోడ్లు సరిగ్గా పనిచేస్తున్నట్లు సంస్థ CEO ఎలాన్ మస్క్ తెలిపారు. ఈ ఏడాది DECలోగా మరో 8 మంది మెదళ్లలో చిప్‌ను ప్రవేశపెడతామన్నారు. వెన్ను, మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపయోగపడేలా ఈ చిప్‌ను అభివృద్ధి చేస్తున్నారు.
Similar News
News January 6, 2026
SC ఉత్తర్వులపై విపక్షాల ప్రశ్నలు

ఢిల్లీ అల్లర్ల కేసు(2020)లో సామాజిక కార్యకర్తలు ఉమర్, షర్జీల్‌లకు SC బెయిల్ నిరాకరించడాన్ని విపక్ష పార్టీలు ప్రశ్నించాయి. మహిళలపై అత్యాచారం చేసిన కేసు(2017)లో గుర్మీత్ సింగ్‌కు 15వ సారి పెరోల్‌పై కోర్టు విడుదల చేసిందని గుర్తుచేశాయి. విచారణ లేకుండా 5 ఏళ్లు నిర్బంధించడం రాజ్యాంగ విరుద్ధం కాదా? అని MA బేబీ(CPM) వ్యాఖ్యానించారు. బెయిల్ నిరాకరణ ద్వంద్వ నీతిని బహిర్గత పరుస్తోందని D.రాజా(CPI) అన్నారు.
News January 6, 2026
జ్యోతి యర్రాజీని కలిసిన మంత్రి లోకేశ్.. ₹30.35 లక్షల సాయం

AP: ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్స్‌షిప్ 100M హర్డిల్స్‌లో స్వర్ణ విజేతగా నిలిచిన జ్యోతి యర్రాజీని కలవడం సంతోషంగా ఉందని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు తెలియజేశారు. ఆమె ధైర్యం, సంకల్పం దేశానికి స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. ఏషియన్, కామన్వెల్త్ గేమ్స్‌లో సన్నద్ధతకు ₹30.35L సహాయాన్ని అందజేసినట్లు వెల్లడించారు. ఒలింపిక్ కలను సాకారం చేసే దిశలో ఆమెకు అండగా నిలుస్తామన్నారు.
News January 6, 2026
సంక్రాంతి సెలవులు ఖరారు చేసిన ప్రభుత్వం

TG: రాష్ట్రంలో సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ నెల 10 నుంచి 16 వరకు హాలిడేస్ ఉంటాయని ప్రకటించింది. తిరిగి శనివారం (17న) స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు ఈ సెలవుల షెడ్యూల్‌ను పాటించాలని ఆదేశించారు. అటు ఏపీలో ఈ నెల 10 నుంచి 18 వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.


