News August 5, 2024

మరో మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్

image

ఈ ఏడాది జనవరిలో తొలిసారి ఓ మనిషి(<<12569229>>అర్బాగ్<<>>) మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ ప్రవేశపెట్టిన న్యూరాలింక్ తాజాగా మరో వ్యక్తిలోనూ చిప్ అమర్చినట్లు తెలిపింది. అతని మెదడులోని 400 ఎలక్ట్రోడ్‌లు సరిగ్గా పనిచేస్తున్నట్లు సంస్థ CEO ఎలాన్ మస్క్ తెలిపారు. ఈ ఏడాది DECలోగా మరో 8 మంది మెదళ్లలో చిప్‌ను ప్రవేశపెడతామన్నారు. వెన్ను, మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపయోగపడేలా ఈ చిప్‌ను అభివృద్ధి చేస్తున్నారు.

Similar News

News September 19, 2024

భారత చెస్ జట్లు అదుర్స్!

image

చెస్ ఒలింపియాడ్‌ -2024లో భారత చెస్ జట్లు అదరగొడుతున్నాయి. టోర్నీ ప్రథమార్థం తర్వాత ఓపెన్, మహిళల జట్లూ అజేయంగా నిలిచి మొదటిస్థానంలో నిలిచాయి. రెండు జట్లూ వరుసగా చైనా, జార్జియాను ఓడించి 14 మ్యాచ్ పాయింట్లను సాధించాయి. ఇంకా నాలుగు రౌండ్‌లు మిగిలి ఉండగా, రెండు విభాగాల్లోనూ ప్రతి మ్యాచ్‌లో భారత్ గెలిచింది. మరిన్ని విజయాలు భారత్ కైవసం కావాలని నెటిజన్లు కోరుతున్నారు.

News September 19, 2024

కంటిచూపు మెరుగుపడాలంటే..

image

*పాలకూర, తోటకూర, కొలార్డ్ గ్రీన్స్ లాంటి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.
* విటమిన్ E ఎక్కువగా ఉండే బాదం, పొద్దుతిరుగుడు, గుమ్మడికాయ విత్తనాలు తినాలి.
*స్వీట్ పొటాటోల్లో విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. రేచీకటిని తగ్గిస్తుంది.
*ఆరెంజ్, నిమ్మ, ద్రాక్ష లాంటి సిట్రస్ పండ్లతో పాటు క్యారెట్లు తినాలి.

News September 19, 2024

ప్రకాశం బ్యారేజ్ నుంచి రెండో పడవ తొలగింపు

image

AP: ప్రకాశం బ్యారేజ్‌ను ఢీకొట్టిన రెండో పడవను ఎన్నో రోజుల ప్రయత్నం తర్వాత ఇవాళ విజయవంతంగా తొలగించారు. ఇనుప గడ్డర్లతో 2 పడవలను అనుసంధానించి చైన్ పుల్లర్లతో ఎత్తుకు లేపి బ్యారేజీ ఎగువకు తరలించారు. బ్యారేజీ వద్ద ఇంకా బోల్తా పడి ఉన్న మరో భారీ, మోస్తరు పడవ రేపు ఒడ్డుకు తరలిస్తామని ఇంజినీర్లు వెల్లడించారు.