News October 23, 2024
ఉచిత గ్యాస్ సిలిండర్లపై మరో కీలక ప్రకటన
AP: ప్రతి ఏటా రూ.2,684కోట్లతో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈనెల 31న ఈ స్కీమ్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది మూడు సిలిండర్లను ఇచ్చేందుకు ఒక షెడ్యూల్‌ను ఖరారు చేశామన్నారు. ఏప్రిల్-జులై మధ్య మొదటి సిలిండర్, ఆగస్టు-నవంబర్ మధ్య రెండోది, డిసెంబర్-మార్చి 31 మధ్య మూడో సిలిండర్‌ను ఇవ్వనున్నట్లు తెలిపారు.
Similar News
News November 12, 2024
STOCK MARKETS: రియాల్టి షేర్ల జోరు
దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు తీవ్ర ఆటుపోట్లకు లోనవుతున్నాయి. క్షణాల్లోనే పెరుగుతూ తగ్గుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్స్ రావడం, CPI డేటా రావాల్సి ఉండటమే ఇందుకు కారణాలు. సూచీల గమనం తెలియకపోవడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్ 79,582 (+86), నిఫ్టీ 24,166 (+25) వద్ద ట్రేడవుతున్నాయి. రియాల్టి, ఐటీ, మీడియా, హెల్త్‌కేర్ షేర్లు పెరిగాయి. ఆటో, FMCG సూచీలు తగ్గాయి.
News November 12, 2024
చినాబ్ రైల్వే బ్రిడ్జిపై మాక్ డ్రిల్
J&Kలోని చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిపై ఇవాళ భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఏదైనా విపత్తు సంభవిస్తే ఎలా అప్రమత్తం కావాలనేది చేసి చూపించాయి. SOG, CRPF 126bn, GRP, RPF, SDRF, ఫైర్&ఎమర్జెన్సీ, మెడికల్ బృందాలు డ్రిల్‌లో పాల్గొన్నాయి. నదీ గర్భం నుంచి 359M ఎత్తులో 1,315M పొడవుతో దీన్ని నిర్మించారు. దీనిపై 4 నెలల కిందట రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి.
News November 12, 2024
వర్మతో వర్మ అండ్ వర్మ.. ఫొటో వైరల్
డైరెక్టర్ రాంగోపాల్ వర్మను యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ‘ఫ్యామిలీ మ్యాన్’ రైటర్ సుపర్న్ వర్మ కలిశారు. ఈ సందర్భంగా వారు తీసుకున్న ఫొటోను రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. వర్మతో వర్మ అండ్ వర్మ అని ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. అయితే, తమకు క్యాస్ట్ ఫీలింగ్ లేదనే విషయంపై తాను ప్రమాణం చేయలేనని చమత్కరించారు. ఈ ముగ్గురూ నిన్న రాత్రి ఓ పార్టీలో కలిసినట్లు తెలుస్తోంది.