News April 5, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కొత్త అంశం
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నల్గొండకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మునుగోడు ఉపఎన్నికల సమయంలో వారు ఫోన్ ట్యాపింగ్‌కి పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. అప్పుడు మాజీ MLA, ప్రస్తుతం MLAగా ఉన్న ఓ కీలక నేత ఫోన్‌ను వారు ట్యాప్ చేశారట. దీంతో వారిని HYD తీసుకొచ్చి విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ట్యాపింగ్ కేసుతో లింకై ఉన్న అంశాలన్నింటిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Similar News
News January 24, 2025
BREAKING: టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ఏప్రిల్ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300) టోకెన్లను టీటీడీ విడుదల చేసింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల బుకింగ్‌ను అందుబాటులో ఉంచనుంది.
News January 24, 2025
హీరోయిన్ ‘కలర్స్’ స్వాతి విడాకులు?
సోషల్ మీడియాలో భాగస్వామి ఫొటోలను డిలీట్ చేయడం సెలబ్రిటీల విడాకులకు హింట్‌గా నెటిజన్లు భావిస్తున్నారు. తాజాగా హీరోయిన్ ‘కలర్స్’ స్వాతి ఆ విధంగానే వార్తల్లో నిలిచారు. ఆమె తన భర్త వికాస్ వాసుతో దిగిన ఫొటోలను SM నుంచి తొలగించారు. దీంతో భర్తతో స్వాతి విడాకులు తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఆమె నటించిన ‘మంత్ ఆఫ్ మధు’ ప్రమోషన్స్ సమయంలోనూ ఇలాంటి రూమర్సే రాగా స్పందించేందుకు స్వాతి నిరాకరించారు.
News January 24, 2025
Stock Markets: బ్యాంకు, ఫార్మా, మీడియా, హెల్త్‌కేర్ షేర్లు డౌన్
దేశీయ స్టాక్‌మార్కెట్లు రేంజుబౌండ్లో కొనసాగుతున్నాయి. ఉదయం మోస్తరు లాభాల్లో మొదలైన బెంచ్‌మార్క్ సూచీలు ప్రస్తుతం ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 23,208 (+2), సెన్సెక్స్ 76,533 (+13) వద్ద చలిస్తున్నాయి. IT, మెటల్, రియాల్టి, O&G షేర్లు పుంజుకున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఆటో, ఫార్మా, మీడియా, హెల్త్‌కేర్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. పవర్‌గ్రిడ్, JSW స్టీల్, BPCL, NTPC, టాటా స్టీల్ టాప్ గెయినర్స్.