News September 6, 2024
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్!
వాట్సాప్‌లో వాయిస్/వీడియో కాల్స్ కోసం లింక్స్ క్రియేట్ చేసే ఫీచర్ రానుంది. గ్రూప్ చాట్స్‌లో లింక్ క్రియేట్ చేసి పంపిస్తే మిగతా వారు ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వొచ్చు. అంటే కాల్స్ మాట్లాడటానికి రింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కాల్ యాక్టివ్‌లో ఉంటే ఎవరైనా ఎప్పుడైనా లింక్‌పై ట్యాప్ చేసి జాయిన్ అయ్యే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉందని వాబీటా ఇన్ఫో పేర్కొంది.
Similar News
News October 15, 2024
ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించను: చంద్రబాబు
AP: మద్యం దుకాణాల్లో వాటాల కోసం అరాచకాలు సృష్టిస్తే సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మద్యం, ఇసుక విషయంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ విధానానికి కట్టుబడి ఉండాలని చెప్పారు. ‘వైన్ షాపులు గెలుపొందిన వారు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా వాటాల కోసం బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ఆయన అధికారులను ఆదేశించారు.
News October 15, 2024
కెనడాతో ఇక కటిఫ్.. ఎన్నికల వరకు ఇంతేనా!
భారత్-కెనడా మధ్య వివాదాలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ట్రూడో ప్రభుత్వ ఖలిస్తానీ వేర్పాటువాద అనుకూల విధానాలపై ఆగ్రహంగా ఉన్న భారత్ అక్కడి దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించింది. అలాగే ఇక్కడి కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించింది. కెనడాలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల వరకు పరిస్థితులు సద్దుమణిగే పరిస్థితి కనిపించడం లేదు. కెనడా వైఖరి మారితేనే దౌత్య బంధాలపై స్పష్టతరానుంది.
News October 15, 2024
అక్టోబర్ 15: చరిత్రలో ఈ రోజు
1931: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ జననం
1933: డైరెక్టర్ పి.చంద్రశేఖర్ రెడ్డి జననం
1939: నటుడు జీ రామకృష్ణ జననం
1953: ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి జననం
1987: హీరో సాయి ధరమ్ తేజ్ జననం
1994: పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజమ్ జననం
2022: సినీ నిర్మాత కాట్రగడ్డ మురారి మరణం
ప్రపంచ విద్యార్థుల దినోత్సవం
ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం