News February 7, 2025

ఇంటర్ విద్యార్థులకు మరో అవకాశం

image

TG: ఇంటర్ ప్రాక్టికల్స్‌కు హాజరుకాని విద్యార్థులకు మరో అవకాశం కల్పించాలని బోర్డు నిర్ణయించింది. అనారోగ్యం లేదా అత్యవసర కారణాల వల్ల నిర్ణీత తేదీల్లో పరీక్షలకు హాజరు కాని వారికి మళ్లీ ఎగ్జామ్ రాసేందుకు ఛాన్స్ ఇవ్వనుంది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం విద్యార్థులు డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీని సంప్రదించాలని సూచించింది. ఈనెల 22తో ఇంటర్ ప్రాక్టికల్స్ ముగియనున్నాయి.

Similar News

News November 5, 2025

రేవంత్, కేసీఆర్‌పై కిషన్ రెడ్డి ఫైర్

image

TG: ఇచ్చిన హామీలు అమలు చేయని రేవంత్ ఏ ముఖం పెట్టుకొని జూబ్లీహిల్స్‌లో ఓట్లు అడుగుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎర్రగడ్డలో ప్రచారం సందర్భంగా రేవంత్, KCRపై ఆయన ఫైర్ అయ్యారు. ‘తులం బంగారం, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు అడిగితే రేవంత్ ఫ్రీ బస్సు అంటున్నారు. అటు కేసీఆర్ పాలనలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాలేదు కానీ ఆయన కుటుంబీకులు ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారు’ అని మండిపడ్డారు.

News November 5, 2025

బనకచర్ల, ఆల్మట్టిపై సుప్రీం కోర్టులో పోరాటానికి నిర్ణయం

image

TG: AP బనకచర్ల ప్రాజెక్టు, కర్ణాటక ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంపు అంశాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఇప్పటికే నీటిపారుదల, జల వనరుల నిపుణుల నుండి అభిప్రాయం తీసుకుంటోంది. CM రేవంత్ రెడ్డికి దీనికి సంబంధించిన ఫైల్‌ను పంపి ఆయన ఆమోదించిన వెంటనే SCలో ఇంటర్లోక్యుటరీ అప్లికేషన్ దాఖలు చేయనుంది. ఈ 2 ప్రాజెక్టులపై TG ఇప్పటికే జలశక్తి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది.

News November 5, 2025

KTR.. రాజీనామాకు సిద్ధంగా ఉండు: CM రేవంత్

image

TG: సవాళ్లు విసిరి పారిపోవడం KTRకు అలవాటేనని CM రేవంత్ అన్నారు. ఆయన విసిరే సవాళ్లను కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పట్టించుకోరని పేర్కొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఇచ్చిన నిధులపై జీవోలు ఇస్తామని, కేటీఆర్ రాజీనామాకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్‌పేట్ రోడ్ షోలో ఆయన ప్రచారం నిర్వహించారు. రాష్ట్రానికి నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు.